ByGanesh
Mon 25th Mar 2024 08:31 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు, ఆయన మార్కెట్ కి సరితూగేలా బడ్జెట్ పెట్టాల్సిందే. మరి ప్రభాస్ ప్రస్తుతం చేసేవన్నీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్.. అవి కూడా భారీగా తెరకెక్కేవే. కానీ ప్రభాస్ మారుతి తో చేస్తున్న రాజా సాబ్ విషయమే నిన్నటివరకు అభిమానులకి లెక్క తేలలేదు. మారుతి తో ప్రభాస్ మీడియం బడ్జెట్ తో సినిమా చేస్తున్నాడా.. అది ప్యాన్ ఇండియా రేంజ్ మూవీ కాదా అనే అనుమానం చాలామందిలో ఉంది.
కానీ మారుతి ప్రభాస్ రాజా సాబ్ లెక్క గురించి చెప్పి అభిమానులకి షాకిచ్చాడు. రాజా సాబ్ బడ్జెట్ పై నెటిజెన్స్ లో ఉన్న అనుమానాలు మారుతి నివృత్తి చేసాడు. తాను దర్శకుడిగా తెరకెక్కించిన మొదటి సినిమా ఈరోజుల్లోకి కేవలం 30లక్షల బడ్జెట్ ఖర్చు పెట్టిన మారుతి, ప్రభాస్ తో తెరకెక్కించే రాజాసాబ్ 4 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ.4 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించినట్లు సమాచారం. అంటే రాజా సాబ్ కోసం రోజుకు కోటి ఖర్చవుతోందన్నమాట.
అదే తాను తెరకెక్కించేది ప్రభాస్ సినిమా కాకపోతే ఈ బడ్జెట్‌లో రెండు మూడు చిత్రాలు తెరకెక్కించేవాడిని, ఒక్క రోజు బడ్జెట్ తో ఒక సినిమాని సులభంగా పూర్తి చేసేసేవాడిని అంటూ మారుతి చెప్పినట్టుగా సన్నిహితుల సమాచారం. మరి ఎప్పుడూ చిన్న, మీడియం బడ్జెట్ లతో సినిమాలు చేసే మారుతి కి ప్రభాస్ తో మూవీ అంటే పెద్ద భారమే. అయినా ఫస్ట్ లుక్ తోనే వింటేజ్ ప్రభాస్ ని దించి తన రేంజ్ చిన్నది కాదు అని నిరూపించాడు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా మారుతి రాజా సాబ్ ని తెరకెక్కిస్తున్నాడనేది ఇప్పుడు క్లియర్ అయ్యింది.
Maruthi Revealed Raja Saab Movie Single Day Budget:
Maruthi Spending Big Budget For Prabhas Film?