Health Care

ముద్దులు పెట్టుకుంటే అలాంటి వ్యాధులు వస్తాయా ?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..


దిశ, ఫీచర్స్ : మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం అంటే వారి పై ఉన్న మీ ప్రేమను వ్యక్తపరచడమే. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని చూపుతుంది. ఇలా ముద్దు పెట్టుకోవడం ద్వారా మిలియన్ల కొద్దీ నోటి బ్యాక్టీరియా ఒకదానికొకటి బదిలీ అవుతుంటాయి. అయితే లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDs)లు ముద్దుతో వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ సంక్రమణ లైంగిక కార్యకలాపాల సమయంలో జననేంద్రియ భాగాలు, ఆసన, నోటి భాగాలతో ప్రత్యక్ష సంబంధం కారణంగా సంభవిస్తుంటాయని సెక్స్ నిపుణులు చెబుతున్నారు. అయితే లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన నివారణలు ఉన్నాయని చెబుతున్నారు.

ముద్దులు HSVకి కారణం కావచ్చు..

హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV) సంక్రమణ ముద్దు ద్వారా సాధ్యపడుతుంది. ఈ వైరస్ నోటి, జననేంద్రియ హెర్పెస్ కి బాధ్యత వహిస్తుంది. వైరస్ శరీరంలో చురుకుగా ఉన్నప్పుడు అది వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. చాలా సార్లు లక్షణాలు లేకపోవడంతో రోగికి తన ఇన్ఫెక్షన్ గురించి తెలియదని చెబుతున్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్ సమయంలో ముద్దులు పెట్టుకోవడం లేదా ఓరల్ సెక్స్‌ను నివారించడం మంచిదంటున్నారు నిపుణులు.

ముద్దు పెట్టుకోవడం వల్ల సిఫిలిస్ వస్తుందా..

ఎవరినైనా ముద్దు పెట్టుకోవడం ద్వారా సిఫిలిస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బహిరంగ గాయాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తికి నోటిలో లేదా చుట్టుపక్కల సిఫిలిస్ పుండ్లు ఉంటే, ముద్దు పెట్టుకునే వ్యక్తికి సంక్రమణ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సిఫిలిస్ జననేంద్రియాలతో కూడిన లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు.

మీ భాగస్వామితో సురక్షితంగా ఇలా శృంగారం చేయవచ్చు..

రక్షణ లేకుండా సెక్స్ చేయవద్దు.

యోని, ఆసన, నోటి సెక్స్ సమయంలో కండోమ్‌లను ఉపయోగించాలి.

లైంగికంగా సంక్రమించే వ్యాధుల కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.

మీ లైంగిక చరిత్రను మీ భాగస్వామితో బహిరంగంగా చర్చించాలి.

ఆరోగ్య పరీక్ష ఫలితాలను మీ భాగస్వామితో పంచుకోవాలి.

లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులను సంప్రదించి, సలహాలు తీసుకోవడం మంచిదంటున్నారు.



Source link

Related posts

నేడు వరల్డ్ సోషల్ వర్క్ డే..ఈ రోజే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Oknews

నచ్చినప్పుడు వర్క్.. నచ్చనప్పుడు రెస్ట్.. ప్రొడక్టివిటీలోనూ బెస్ట్.. ‘క్రోనో వర్క్‌’పై ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆసక్తి..

Oknews

బంగాళాదుంపతో ఫోన్‌కి ఛార్జింగ్.. వీడియో వైరల్.. నిజం ఏంటో తెలుసా..

Oknews

Leave a Comment