Entertainment

నాని ఇంటికెళ్లిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషర్..చంద్రబాబు నాయుడు, చిరంజీవిని కలిసాడు


తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత మంది స్టార్స్ లు ఉన్నా నాచురల్ స్టార్ నాని ప్రత్యేకతే వేరు. ఎవరి అండదండలు లేకుండా సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటు వెళ్తున్నాడు.గత 15  సంవత్సరాల నుంచి ఇదే తంతు. ఏ విధమైన మార్పు లేదు. తాజాగా నానిని ఒక స్పెషల్ వ్యక్తి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  

గారెత్ విన్ ఓవెన్. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరుపున బ్రిటీష్ డిప్యూటీ హైకమిషర్ గా పని చేస్తున్నారు. ఎక్స్  క్లూసివ్ గా  హీరో నాని ని కలిశారు. హైదరాబాద్ లోని నాని నివాసానికి వెళ్లిన ఆయన్ని నాని కూడా ఎంతో మర్యాద పూర్వకంగా ఆహ్వానించాడు. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాలు ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు అనే అంశంపైనా ఇద్దరు సుదీర్గంగా చర్చించారు .ఈ సందర్భంలో నాని చాలా విలువైన సలహాలు కూడా ఇచ్చాడు. ఇప్పడు వీళిద్దరి కలయిక సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది. ఇక నాని ఫ్యాన్స్ అయితే తమ హీరో రేంజ్ ఇది అని అంటున్నారు.

 నానీని కలవడం ఎంతో ఆనందం కలిగించింది.అతని  సినీ, వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నాను. ఈ సందర్భంగా  తను నటించిన రెండు సినిమాలు చూడమని  నాకు సూచించాడని గారెత్ ట్విటర్ వేదికగా వెల్లడి చేసాడు. ఏ సినిమాలు చూడాలో చెప్పండి అంటూ కూడా  నెటిజన్లను కోరాడు.నాని తో దిగిన ఫోటోలని కూడా షేర్ చేసాడు. గారెత్ గతంలో చిరంజీవిని కూడా కలిసాడు.నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే మూవీ చేస్తున్నాడు.ఆ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

 



Source link

Related posts

మరణించిన తర్వాత కూడా జీవించండి.. చేసి చూపించిన డేనియల్‌ బాలాజీ!

Oknews

‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ

Oknews

కొందరి అభిమానానికి వెల కట్టలేం.. ఎమోషనల్‌ అయిన రాజమౌళి!

Oknews

Leave a Comment