దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గుండెపోటు కారణంగా రోజురోజుకు మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. అప్పటి వరకు బాగానే మాట్లాడుతూ.. నడుస్తూ ఉన్నట్లుండి అక్కడికక్కడే కుప్పకూలి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. దీనికి కారణం జీవన శైలిలో మార్పులు ఓ కారణమని చెప్పుకోవచ్చు. కొంతమంది యువతలో ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల గుండెపోటుకు గురవుతున్నారు. రక్తనాళాలు సరిగా లేకపోయినా, చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోయిన, మద్యం, సిగరెట్ సేవించే వాళ్లు, అధిక రక్తపోటు ఉన్నవారికి హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు.
అయితే గుండెపోటుకు దంతాలు, చిగుళ్ల నొప్పి కూడా కారణమవుతోందని తాజాగా కార్డియాలజిస్టులు వెల్లడించారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ కు వచ్చే ముందు చెస్ట్ లో పెయిన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ దంతాల చిగుళ్లలో నొప్పి, చిగుళ్లలో వాపు, రక్తస్రావం, దీర్ఘకాలిక పంటి నొప్పి వంటి సమస్యలు తలెత్తినట్లైతే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలని కార్డియాలజిస్టులు సలహా ఇస్తున్నారు. చిగుళ్లలో నొప్పి, పంటి నొప్పి గుండెపోటుతో లోతైన సంబంధం ఉందని చెబుతున్నారు. నోటి ఆరోగ్యం కారణంగా హార్ట్ హెల్త్ క్షీణించే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని, చిగుళ్లలో వాపు, దీర్ఘకాలంగా దంతాల్లో ఉండే మురికి, హార్ట్ ఎటాక్ కు దారి తీస్తుందని అంటున్నారు. కాగా నోటి, పంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యుల్ని కలవాలని, లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కార్డియాలజిస్టులు సూచిస్తున్నారు.