వాలంటీర్లపై బొజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు-షాకిచ్చిన టీడీపీ
వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy On Volunteers) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని టెర్రరిస్టులతో పోలుస్తూ విమర్శించారు. బొజ్జల వ్యాఖ్యలపై టీడీపీ(TDP) స్పందించింది. బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధంలేదని ప్రకటించింది. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు జీతాలు పెంచుతామని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. అయితే కొంతమంది వాలంటీర్లు వైసీపీకి అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికే ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించిన 200 మందికి పైగా వాలంటీర్లను ఈసీ సస్పెండ్ చేసిందని గుర్తుచేసింది. వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని టీడీపీ సూచించింది.