చిరు తనయుడు నుంచి తెలుగు సినిమా చిరుతగా ఆయన ఎదిగిన తీరు అద్వితీయం. చెర్రీ సినిమా రిలీజ్ అయిందంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అభిమానుల చేసే హడావిడి కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. తన ప్రతి సినిమాకి ఒక్కో కొత్త రికార్డుని సృష్టించుకుంటు వెళ్తున్న చరణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలుసా!
ఈ రోజు ఉదయం వేకువజామున తన సతీమణి ఉపాసన తో కలిసి చరణ్ తిరుమల వచ్చాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ దైవం ఆ ఏడుకొండలవాడిని దర్శించుకొని తన్మయత్వానికి లోనయ్యాడు. చరణ్ గారాల కూతురు క్లీన్ కార కూడా స్వామిని దర్శనం చేసుకుంది.అనంతరం వేద పండితులు చరణ్ కి ఆశీర్వచనాలని అందించి తీర్ధ ప్రసాదాలని అందించారు. చరణ్ తో పాటు ఉపాసన తండ్రి కామినేని అనిల్ మరియు ఇతర కుటుంబ సభ్యులు కూడా స్వామిని దర్శించుకున్నారు. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే ఈ సందర్భంగా అయినా క్లీన్ కార ఫేస్ చూడచ్చని అభిమానులు అనుకున్నారు.కానీ ఉపాసన పాప పేస్ కనపడనీయలేదు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక చరణ్ కి మొదటి నుంచి ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువే. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అయ్యప్ప స్వామి మాల వేస్తాడు. అలాగే తన ప్రొడక్షన్ బ్యానర్ కి కూడా ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. ప్రస్తుతం తాను నటిస్తున్న గేమ్ చేంజర్ త్వరలోనే విడుదలకి సిద్దం అవుతుంది. ఈ రోజు ఆ మూవీ నుంచి చరణ్ పుట్టిన రోజు కానుకగా ఒక సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది. అలాగే ఇంకో నూతన చిత్రాన్ని కూడా ఇటీవలే ప్రారంభించాడు. త్వరలోనే ఆ మూవీ షూటింగ్ కి వెళ్లనుంది.