Health Care

కనువిందు చేస్తున్న కానరీ దీవులు.. ఇక్కడి రంగురాళ్ల బీచ్‌ను చూశారా?


దిశ, ఫీచర్స్ : ప్రకృతి అందాలను, సముద్ర తీరాలను చూసి పరవశించి పోని వారంటూ ఎవరూ ఉండరు. అలాంటి అద్భుతమైన మరొక దృశ్యమే వాయువ్య ఆఫ్రికా తీరంలోని స్పానిష్ ద్వీప సమూహం. ఇక్కడి నలుపు, తెలుపు, నీలం, ఆకుపచ్చ రగుంలతో కూడిన ద్వీప సమూహాల తీరాలు టూరిస్టులను బాగా ఆకట్టుకుంటాయి. వేసవి వచ్చిందంటే చాలామంది పర్యాటకులు ఇక్కడి బీచ్‌లలో సరదాగా గడిపేందుకు వస్తుంటారు. అంతేకాకుండా కానరీ ఐలాండ్స్‌ తీరాలలో రకాల రంగురాళ్లు కూడా దొరుకుతాయి. కాబట్టి వాటిని కూడా తీసుకెళ్లవచ్చు అనే ఉద్దేశంతో ప్రతీ వేసవిలో టూరిస్టుల తాకిడి పెరిగిపోతుంది. ఈసారి వేసవిలో మరింత పెరిగే చాన్స్ ఉంది.

ముఖ్యంగా స్పెయిన్‌లోని కానరీ దీవుల్లో టెనెరిఫే, గ్రాన్ కానరియా, లాంజరోట్, ఫ్యుర్టెవెంచురా, లా పాల్మా, లా గోమెరా, ఎల్. హీరో వంటి ద్వీపాలు అందమైనవే కాకుండా, ఆకట్టుకునే రంగురాళ్లకు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ మంచుతో కూడిన అతిపెద్ద పర్వతం మౌంట్ టీడే కూడా చూడముచ్చటగా ఉంటుంది. అయితే ఏటా టూరిస్టులు పెరిగిపోవడం, ఐలాండ్స్‌లోని రంగురాళ్లను తీసుకెళ్లడం కారణంగా స్పెయిన్ దేశం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే పర్యాటకులు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ద్వీప సమూహంలోని బీచ్‌లలో రంగురాళ్లను మాత్రం తీసుకెళ్లవద్దు అని హెచ్చిరిస్తోంది. ఎవరైనా రంగురాళ్లను ఏరినట్లు గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు జరిమనా వేస్తారట. బీచ్‌లు క్షీణించకుండా, పర్యావరణ సమతుల్యతకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పెయిన్‌కు చెందిన కానరీ ఐలాండ్ టూరిజం శాఖ పేర్కొంటున్నది.



Source link

Related posts

హాయిగా పడుకున్న వ్యక్తిన సడెన్‌గా లేపితే ఏం జరుగుతుందో తెలుసా?

Oknews

సుకన్య సమృద్ధి ఖాతా బ్యాలెన్స్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎలా..!

Oknews

కాకి కావ్ కావ్ అని ఎందుకు అంటుంది.. అసలు దాని అర్థం ఏంటో తెలుసా?

Oknews

Leave a Comment