ByMohan
Wed 27th Mar 2024 03:17 PM
ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సౌత్‌లో హ్యాట్రిక్ హిట్ నమోదు చేసుకునే తాపత్రయంలో ఉంది. సీతారామంతో బ్యూటిఫుల్ హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్నతో డీసెంట్ హిట్ అందుకుంది. ఇప్పుడు మూడో హిట్ కోసం తహతహలాడుతోంది. విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అంటూ ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగమే గ్లామర్‌గా మృణాల్ ఠాకూర్ మత్తెక్కిస్తోంది.
ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో అందాలు ఆరబోస్తూ మృణాల్ ఠాకూర్ అందరి చూపు తనవైపే ఉండేలా చూసుకుంటుంది. విజయ్ దేవరకొండతో కలిసి హోలీ సెలెబ్రేషన్స్‌లో డాన్స్ చేస్తూ అదరగొట్టేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలియతిరుగుతూ హడావిడి చేస్తుంది. ఫ్యామిలీ స్టార్ హిట్ విజయ్ దేవరకొండకి చాలా ఇంపార్టెంట్. కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం హ్యాట్రిక్ అందుకోవాలనే కసితో ఉంది.
తాజాగా మృణాల్ ఠాకూర్ బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మృణాల్ ఠాకూర్ గ్లామర్ డ్రెస్‌లో మత్తెక్కించే లుక్స్‌తో మతిపోగొట్టేసింది అంటూ అభిమానులు ఆమె లేటెస్ట్ లుక్ చూసి కామెంట్స్ చేస్తున్నారు.
Mrunal Thakur in Black Dress Photos Creates Sensation:
Mrunal Thakur Latest Glamour Photos Goes Viral