Sports

SRH vs MI IPL 2024 Mumbai Indians and Sunrisers Hyderabad Mumbai Indians chose field


Mumbai Indians and Sunrisers Hyderabad Mumbai Indians chose field : హైదరాబాద్‌ వేదికగా మరో కీలక సమరం ఆరంభమైంది. ఐపీఎల్‌ (IPL)సీజన్‌ 17ను పరాజయంలో ప్రారంభించిన ముంబై(MI)-హైదరాబాద్‌(SRH) రెండో సమరం ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని దిగ్గజ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా అంచనా వేశాడు. అయినా టాస్‌ గెలిచిన ముంబై ఫీల్డింగ్‌ చేసేందుకే మొగ్గు చూపింది. అనుకున్నట్లుగానే ముంబై స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కీలక ఆటగాడు వనిందు హసరంగా కూడా మ్యాచ్‌కు దూరమయ్యాడు. 200వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న ముంబై స్టార్‌ ప్లేయర్‌, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు… క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రత్యేక జెర్సీ అందించాడు.

విజయం కోసం ఆరాటం
మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకోవాలని ముంబై-హైదరాబాద్‌ జట్లు పట్టుదలతో ఉన్నాయి. హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై టైటిల్‌ వేటను ప్రారంభించాలని చూస్తుండగా… ముంబైకు షాక్‌ ఇచ్చేందుకు హైదరాబాద్‌ కూడా సిద్ధంగా ఉంది. అయిదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, డెవాల్డ్ బ్రెవిస్ రాణించినా ముంబైకి ఓటమి తప్పలేదు. రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేసినా మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. విధ్వంసకర బ్యాటర్లు ఉన్న ముంబై 36 బంతుల్లో 48 పరుగులు చేయలేక ఓటమిపాలు కావడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళన పరుస్తోంది. ముంబై కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లో హార్దిక్‌ ఆకట్టుకోలేక పోయాడు. టిమ్ డేవిడ్, బ్రెవిస్ వంటి ఆటగాళ్లను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు తీసుకొచ్చిన హార్దిక్‌… తాను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్, సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగినా విఫలమయ్యాడు. కేవలం నాలుగు బంతులు మాత్రమే ఆడి వెనుదిరిగాడు. ఇషాన్‌కు టీ 20 ప్రపంచకప్‌ ఆడాలంటే ఐపీఎల్‌లో రాణించడం అవసరం. హైదరాబాద్‌ మ్యాచ్‌లో బ్యాటర్లంతా  గాడినపడాలని ముంబై కోరుకుంటోంది. స్పిన్నర్లు షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా నుంచి హార్దిక్ మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నాడు. 
 
కమ్మిన్స్‌ మాయా చేస్తాడా..?
సొంతగడ్డపై ఆడనుండడం హైదరాబాద్‌కు కలిసిరానుంది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు… కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పరాజయంపాలైన మంచి ఆటతీరు  ప్రదర్శించింది. హెన్రిచ్ క్లాసెన్  అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే హైదరాబాద్‌ గాడిన పడినట్లే. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ SRHకు కీలకంగా మారనుంది. అబ్దుల్ సమద్‌పై హైదరాబాద్‌ భారీ ఆశలు పెట్టుకుంది. అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ రాణిస్తే ముంబై బ్యాటర్లకు తిప్పలు తప్పవు.

మరిన్ని చూడండి



Source link

Related posts

IPL 2024 Mumbai Indians vs Gujarat Titans gujarat choose to bat

Oknews

Ashish Nehra the Unsung Hero of GT | GT vs MI మ్యాచ్ గుజరాత్ ది కావటంలో నెహ్రాది కీలకపాత్ర | ABP

Oknews

India vs Sri lanka Women | Asian Games లో క్రికెట్ లో స్వర్ణం గెలిచిన భారత్ | ABP Desam

Oknews

Leave a Comment