Sports

IPL 2024 RR vs DC Match Prediction preview


Rajasthan Royals vs Delhi Capitals Match Preview:  ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఐపీఎల్‌ 2024(IPL2024)లో తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో… తొలి మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్‌(RR)  రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఆశించిన మేర రాణించలేకపోయిన ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌పై ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ భారీ ఆశలు పెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించలేకపోయిన పంత్‌ కూడా ఈ మ్యాచ్‌లో రాణించాలని పట్టుదలగా ఉన్నాడు.

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ 453 రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన పంత్.. తొలి మ్యాచ్‌లో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో అయినా పంత్‌ అభిమానులను కేరింతలు కొట్టేలా చేస్తాడేమో చూడాలి. బ్యాటింగ్‌లో విఫలమైన పంత్‌… కీపర్‌గా మాత్రం రాణించాడు. ఒక స్టంపింగ్‌ కూడా చేశాడు. మొదటి మ్యాచ్‌లో కాస్త గందరగోళానికి గురైన పంత్‌… రెండో మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌తో కూడిన పటిష్ట బౌలింగ్ లైనప్‌ ఉన్న రాజస్థాన్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. పంత్‌ జట్టులో చేరడం టీంలో ఉత్సాహాన్ని నింపిందని… జట్టు ఇప్పుడు మరింత బలోపేతంగా కనిపిస్తోందని ఢిల్లీ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌ రాణించాలని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌ మెంట్‌ కోరుకుంటోంది. తొలి మ్యాచ్‌లో వీరిద్దరికీ మంచి ఆరంభాలు దక్కినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో పంత్‌పై ఒత్తిడి పెరిగింది. 

ఆత్మవిశ్వాసంతో రాజస్థాన్‌..
సొంత మైదానంలో ఆడుతుండడం రాజస్థాన్‌తో కలిసిరానుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడం రాజస్థాన్‌ ఆత్మ విశ్వాసాన్ని పెంచింది.  రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ జోడీ జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్.. ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. కెప్టెన్‌ సంజూ శాంసన్ అజేయంగా 82 పరుగులు చేయడంతో తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రియాన్ పరాగ్ కూడా రాణించడం రాజస్థాన్‌కు కలిసిరానుంది. కుల్దీప్ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. ట్రెంట్ బౌల్ట్ పేస్‌ కూడా రాజస్థాన్‌ కీలకంగా మారనుంది. 

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సిన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ , షిమ్రాన్ హెట్మేయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, ట్రెంట్ బౌల్ట్,  యుజ్వేంద్ర చాహల్ మరియు తనుష్ కోటియన్. 

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా మరియు షాయ్ హోప్.



Source link

Related posts

Jasprit Bumrah Becomes Fastest Indian Pacer To 150 Test Wickets

Oknews

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Oknews

KL Rahul Ravindra Jadeja Ruled Out Of Second Test In Vizag

Oknews

Leave a Comment