Health Care

వేసవిలో మట్టి కుండలో నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే?


దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిదంటే చాలు చాలా మంది ఫ్రిజ్‌లో వాటర్ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. చాలా చల్లగా వాటర్ తాగుతూ అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. అయితే వేసవిలో ఫ్రిజ్‌లోని వాటర్ కంటే, మట్టికుండలోని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

ఒకప్పుడు పల్లెల్లో ఎక్కడ చూసినా ఇంటి ఇంటికి ఓ కుండ ఉండేది. కానీ ఇప్పుడు ఇంటికొక ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్ కొనుగోలు చేసే స్తోమత లేని వారు మాత్రం ఇప్పటికీ మట్టి కుండలో నీరే తాగుతున్నారు. మరికొందరు ఫ్రిజ్ ఉన్నా కుండలో వాటర్ ఆరోగ్యానికి మంచిదని మట్టి కుండలోని నీరు తాగుతుంటారు. కాగా, మట్టి కుండలోని నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

కుండలో నీరు సహజంగానే చల్లగా ఉండటమే కాకుండా రుచిగా ఉంటాయి. వేసవిలో గ్యాస్ అసిడిటీ లాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే కుండ నీరు తాగడం వలన వాటి నుంచి విముక్తి పొందవచ్చును. అలాగే శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. కాగా, మట్టి కుండలోని నీరు ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఎండ తాపానికి చర్మం జిడ్డుగా, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. మట్టి కుండలోని నీరు తాగడం వలన వాటి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే విధంగా మట్టి కుండలోని నీరు తాగడం వలన జీర్ణక్రియ బాగుంటుంది. వడదెబ్బ తగిలిన వారికి కూడా ఈ నీరు మంచి ఔషధంగా పనిచేస్తాయి.



Source link

Related posts

పిల్లల్లో మలబద్ధకాన్ని నివారిస్తున్న చాక్లెట్స్

Oknews

జిమ్ చేసే యువకులు ఎక్కువగా హార్ట్‌ఎటాక్ బారిన పడటానికి కారణం ఇదే!

Oknews

కొడుకు రాశిలోకి సూర్యుడు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..

Oknews

Leave a Comment