లోన్ కన్సల్టెన్సీపై వార్తలు రాసినందుకే..?ఒక ప్రముఖ దిన పత్రికలో పని చేస్తున్న శ్యామ్ అంతకు ముందు రోజు ఖమ్మంలో అక్రమంగా, అడ్డగోలుగా నడుస్తున్న లోన్ కన్సల్టెన్సీపై అతను పని చేస్తున్న దిన పత్రికలో వార్తను ప్రచురించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ ముఠా రౌడీ షీటర్ల సాయంతో విలేకరిపై దాడి చేసేందుకు పథకం పన్నారు. ఇందులో ప్రవీణ్ అనే వ్యక్తి బ్యాంకులను తప్పుదోవ పట్టించి, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు శ్యామ్ రాసిన వార్తలో ప్రచురితమైంది. ఖమ్మం నగరం కేంద్రంగా లోన్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కథనం రాసినందుకే శ్యాం పై రౌడీ మూకలు దాడికి పాల్పడ్డారన్న విషయం పోలీసులు గుర్తించారు. లోన్ ఆశ చూపి కొందరు అమాయకులే అస్త్రంగా వల విసురుతున్న కన్సల్టెన్సీ బాగోతాన్ని బయట పెట్టిన శ్యాం పై జరిగిన దాడిని తోటి జర్నలిస్టులు, యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
Source link