నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగాన్ని ఏలుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు రాష్టాల్లోనే కాకుండా వేరే రాష్టాల్లో కూడా ఆయనకీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ విషయం ఆయన కొత్త సినిమా రిలీజైన ప్రతిసారి అర్ధం అవుతుంది. అలాగే చాలా మంది తాము ఎంచుకున్న రంగంలో సక్సెస్ సాధించడానికి కూడా మెగాస్టార్ ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. దీన్ని బట్టి ఆయన ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. చిరు కూడా అందుకు తగ్గితే సమాజాన్ని చాలా ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది.
గత కొన్ని రోజుల నుంచి బెంగుళూర్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది.ఎంతో మంది ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంట్లోనే నీటి కరువు ఉందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవి ఈ సమస్య కి ఒక పరిష్కారమార్గాన్ని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తన ఫామ్ హౌస్ లో ఇదే పద్దతిని అవలంబించి నీటి సమస్యని నివారించామని తెలిపాడు. వాటి తాలూకు ఫోటోలని కూడా షేర్ చేసాడు.
పైగా చిరు తన ట్వీట్ ని కన్నడంలోనే చేసాడు.ఇక చిరు కి ఎన్నో సంవత్సరాల నుంచే బెంగళూరు లో ఫామ్ హౌస్ ఉంది. గత సంవత్సరం సంక్రాంతి వేడుకల్ని తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే జరుపుకున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత చిత్రం భోళాశంకర్ ప్లాప్ తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.