TS Inter Summer Holidays 2024 : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(TS Inter Exams 2024) పూర్తి కావటంతో ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి 30వ తేదీని 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి లాస్ట్ వర్కింగ్ డేగా పేర్కొంది. ఇక మార్చి 31వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు(TS Inter Summer Holidays 202) ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. మే 31వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయని ప్రకటించింది. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Source link