Health Care

అక్కడ వర్షం పడినా పన్ను కట్టాల్సిందే !..


దిశ, ఫీచర్స్ : దేశంలో ఆదాయపు పన్ను, ఇంటి పన్ను, టోల్ వంటి అనేక పన్నులు సామాన్యుల జేబులకు భారంగా మారుతున్నాయి. ఈ పన్నులే కాకుండా మన జీవితంలో రోజూ ఉపయోగించే వాటి పై కూడా పన్ను చెల్లించాలి. ఇందులో చిన్న నుంచి పెద్ద ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ‘రెయిన్ ట్యాక్స్’ గురించి ఎప్పుడైనా విన్నారా ? బహుశా సమాధానం లేదు. కెనడాలో వచ్చే నెల నుంచి రెయిన్ ట్యాక్స్ అమలు కానుంది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం కూడా ప్రకటించింది.

గత కొన్ని సంవత్సరాలుగా, టొరంటో నగరంతో సహా దాదాపు మొత్తం కెనడా దేశంలో తుఫాను నీటి నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. తుఫాను కారణంగా ప్రజల రోజువారీ కార్యకలాపాలు చాలా దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు నానాటికీ పెరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టొరంటో అధికారిక వెబ్‌సైట్, నీటి వినియోగదారులు, ఆసక్తిగల పార్టీల సహకారంతో తుఫాను నీటి నిర్వహణను పరిష్కరించడానికి ప్రభుత్వం “స్టార్మ్ వాటర్ ఛార్జ్” వాటర్ సర్వీస్ ఛార్జ్ కన్సల్టేషన్ ప్రోగ్రామ్‌ పై పనిచేస్తోందని పేర్కొంది.

ప్రవాహ సమస్య పెరుగుతుంది..

కెనడాలో వర్షంతో పాటు మంచు కురుస్తుంది. దేశంలో భూమి లేదా చెట్లు, మొక్కలు ఈ నీటిని గ్రహించవు. దీంతో ఆ నీరంతా రోడ్ల పై బయటకు వచ్చేస్తుంది. నగరాలలో, ఇళ్ళు, రోడ్లు, ప్రతీది కాంక్రీటుతో నిర్మితమైనవే. దాంతో నీరు త్వరగా ఎండిపోకుండా రోడ్ల పై ప్రవహిస్తుంది. ఆ కారణంగా రోడ్లు, డ్రెయిన్లు మూసుకుపోయే సమస్య తలెత్తుతోంది. ఈ సమస్యను రన్‌ఆఫ్ అంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించింది. ఈ విధానం ద్వారా సేకరించిన అదనపు నీటిని బయటకు తీయనున్నారు. దేశంలో ప్రవాహ సమస్య ఎక్కువగా టొరంటో నగరంలో సంభవిస్తుంది.

వర్షపు పన్ను అంటే ఏమిటి ?

కెనడాలో ప్రజల ఇళ్ల ద్వారా మురుగునీటిలోకి ఎంత ఎక్కువ నీరు వెళుతుందో, వారి నుంచి అంత ఎక్కువ పన్ను వసూలు చేయనున్నారు. ఈ నియమాన్నే ‘రైన్ ట్యాక్స్’ అంటారు. అయితే, కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చాలా మంది ప్రశ్నలు లేవనెత్తి, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

రన్‌ఆఫ్‌ను నిర్వహించడానికి టొరంటో పరిపాలన నగరంలోని అన్ని ఆస్తుల పై దీన్ని అమలు చేయగలదు. ఇందులో భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. టొరంటో నగర ప్రజలు నీటి పై పన్ను చెల్లిస్తారు. ఇందులో తుఫాను నీటి నిర్వహణ ఖర్చు కూడా ఉంటుంది. ఈ కొత్త పన్ను విధించిన తర్వాత సామాన్య ప్రజలు ఆర్థికంగా మరింత నష్టపోనున్నారు. అందుకే ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పన్ను ఎలా లెక్కిస్తారు ?

వర్షపు పన్ను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఎక్కువ భవనాలు ఉన్న చోట, ఎక్కువ రన్‌ఆఫ్ ఉంటుంది. అందుకే అక్కడ వర్షం పన్ను కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇళ్ళు, పార్కింగ్ స్థలాలు, రోడ్లు, కాంక్రీటుతో చేసిన అనేక నిర్మాణాలు ఉన్నాయి. అలాగే తక్కువ భవనాలు ఉన్న ప్రదేశాలలో పన్ను తగ్గుతుంది.

సామాన్యుల సమస్యలు ఎలా పెరుగుతాయి ?

కెనడాలో వ్యక్తుల పై వ్యక్తిగత పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్ పోస్ట్ నివేదిక ప్రకారం కెనడా ప్రపంచంలో అత్యధిక వ్యక్తిగత పన్ను విధింపులు ఉన్న దేశాల విభాగంలోకి వస్తుంది. అందుకే వర్షపు పన్ను వల్ల ప్రజల కష్టాలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాక అద్దె ఇళ్లలో నివసించే వారికి పన్ను విధించనున్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.



Source link

Related posts

Drinking warm water : ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

Oknews

పురుషులు చేస్తామనే కాన్ఫిడెంట్‌తో ఉంటారు.. కానీ చేయలేరు !

Oknews

భోజనం చేశాక వీటిని రెండు తింటే చాలు..

Oknews

Leave a Comment