GossipsLatest News

TDP final list here టీడీపీ ఫైనల్ లిస్ట్.. గంట మోగిందిగా!


మోగిన గంటా.. రఘురామకు ఝలక్! 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని కూటమి ఏ రేంజ్‌లో వ్యూహ రచన చేస్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కట్టగా.. ఇప్పటి వరకూ దాదాపు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేయగా.. తాజాగా పెండింగ్‌లో ఉన్న 09 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను తెలుగుదేశం ప్రకటించింది.

ఇదిగో గెలుపు గుర్రాలు!

చీపురుపల్లి : కళా వెంకట్రావు

భీమిలి: గంటా శ్రీనివాసరావు

పాడేరు: కె. వెంకటరమేశ్‌ నాయుడు

దర్శి : గొట్టిపాటి లక్ష్మి

రాజంపేట : సుగవాసి సుబ్రహ్మణ్యం

ఆలూరు : వీరభద్ర గౌడ్‌

గుంతకల్లు : గుమ్మనూరు జయరామ్

అనంతపురం అర్బన్‌ : దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌

కదిరి : కందికుంట వెంకట ప్రసాద్‌‌

ఎంపీ అభ్యర్థులు

విజయనగరం : కలిశెట్టి అప్పలనాయుడు

ఒంగోలు: మాగుంట శ్రీనివాసులురెడ్డి

అనంతపురం : అంబికా లక్ష్మీనారాయణ

కడప: భూపేష్‌రెడ్డిలను అభ్యర్థులుగా టీడీపీ ప్రకటించింది. 

కాగా.. ఆదరిస్తుందనుకున్న టీడీపీ.. రఘురామకృష్ణం రాజుకు ఝలక్ ఇచ్చేసింది. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని భావించిన ఆర్ఆర్ఆర్.. చివరికి బీజేపీకి సీటు వెళ్లడం.. ఈయన్ను కాదని వర్మకు టికెట్ ఇవ్వడంతో బిగ్ షాక్ తగిలింది. ఇప్పుడు ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి అయినా పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావించినప్పటికీ అదీ జరగలేదు. దీంతో రఘురామ పరిస్థితేంటో ఆయనకే తెలియాలి. ఇక గంటా మాత్రం గట్టిగానే మోగించదని చెప్పుకోవచ్చు. ఎలాగంటే టార్గెట్‌  మంత్రి బొత్సాగా చంద్రబాబు వ్యూహ రచన చేసినప్పటికీ.. గంటా మాత్రం చీపురుపల్లి వద్దు.. భీమిలీయే ముద్దని గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు. అంతేకాదు.. భీమిలీ ఇస్తే సరే లేకుంటే పార్టీ మారడానికి కూడా సిద్ధమైనట్లు వార్తలు కూడా వచ్చాయి. అనుకున్నట్లుగానే భీమిలి గంటా అకౌంట్‌లోనే పడింది.





Source link

Related posts

'బూమర్ అంకుల్' మూవీ రివ్యూ

Oknews

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్

Oknews

Medaram | Phone Charging Business | Medaram

Oknews

Leave a Comment