దిశ, ఫీచర్స్ : సమ్మర్ వచ్చిదంటే చాలు ఎక్కువ సమయం ఇంట్లో గడపడానికే ఇష్టపడుతాము. కానీ ఈ వేసవిలో ఎక్కువ వేడి, ఉక్కపోతతో నరకం చూడాల్సిందే. ముఖ్యంగా రేకుల షెడ్ ఇల్లు ఉన్నవారు వేడితో చాలా ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం మార్చి నెల ప్రారంభంలోనే మండుటెండలు దంచికొడుతున్నాయి. దీంతో ఫ్యాన్, కూలర్, ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు జనాలు. యితే హాట్ సమ్మర్‌లో మన ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే, ఈ టిప్స్ పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేసి వాటిలో ఐస్ క్యూబ్స్ పెట్టి గదిలో ఓ మూలన దాన్ని ఉంచాలి. అప్పుడు ఫ్యాన్ వేయడం వలన గాలికి ఆ చల్లదనాన్ని లాక్కుని ఇల్లు చల్లగా ఉంటుంది.
- ఇంట్లో కిటికీలు, డోర్ల దగ్గర మొక్కల కుండీలను పెట్టడం వలన, మొక్కలు వేడిని గ్రహిస్తాయి. దీంతో ఇళ్లు చల్లగా ఉంటుంది.
- ఇంటి పైకప్పు మీద వరిగడ్డి వేసి నీరు చల్లాలి దీని వలన ఇల్లు కూల్‌గా ఉంటుంది.
- ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్లు వేసవిలో సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో తిరిగేలా సెట్ చేయడం వలన ఇల్లు చల్లగా ఉంటుంది.
- ఇంట్లోకి వేడి గాలి రాకుండా కర్ట్‌న్స్ వేసి ఉంచాలి. దీని వలన ఇల్లు కూల్‌గా ఉంటుంది.
- ఇంటి ఆవరణంలో చెట్లు పెంచుకోవాలి. దీని వలన ఇంటి లోపలికి వేడిగాలి రాకుండా ఉంటుంది.