Sports

IPL 2024 LSG vs PBKS Match Head to head records


IPL 2024 LSG vs PBKS Match Head to head records : లక్నో సూపర్ జెయింట్స్(LSG), పంజాబ్‌ కింగ్స్(PBKS) మధ్య ఐపీఎల్‌(IPL)లో పదకొండో మ్యాచ్‌ జరగనుంది. లక్నోలోని ప్రసిద్ధ ఎకానా క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు లక్నో ఒకే మ్యాచ్‌ ఆడగా… అందులో ఓడిపోయింది. కెప్టెన్ KL రాహుల్, నికోలస్ పూరన్ 52 బంతుల్లో 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా ఆ మ్యాచ్‌లో లక్నోకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో బలహీనతలన్నీ అధిగమించి సత్తా చాటాలని లక్నో చూస్తోంది. రాహుల్, పూరన్‌లు హాఫ్ సెంచరీలు చేయడం లక్నోకు కలిసి రానుంది. పంజాబ్‌ రెండు మ్యాచ్‌లు ఆడి.. ఒక విజయం ఒక పరాజయంతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి విజయయాత్ర కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

 

గత రికార్డులు ఇవే…

లక్నో సూపర్‌ జెయింట్స్‌- పంజాబ్‌ గతంలో మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో లక్నోదే కాస్త పైచేయిగా ఉంది. లక్నో రెండు మ్యాచుల్లో గెలుపొందగా… పంజాబ్‌ ఒక మ్యాచ్‌లో గెలిచింది. 

 

పిచ్‌ రిపోర్ట్:

లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎకనా స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో రెండు పిచ్‌లు ఉండగా ఒకటి బ్యాటింగ్‌కు.. మరొకటి బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. ఈ పిచ్‌ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్‌పై లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం. ఈ సీజన్‌లో భారత మాజీ క్రికెట గంభీర్‌ ర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. నికోలస్ పూరన్, కెఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ వంటి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడితే భారీ స్కోర్లు ఖాయం.

 

జట్లు

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్‌వీర్‌ సింగ్‌, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతమ్, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్. 

 

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబాడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్రియా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.

మరిన్ని చూడండి



Source link

Related posts

Shreyas Iyer And Ishan Kishan Vs BCCI How The Unprecedented Faceo Ff Happened And Its Impact

Oknews

Umpire Marais Erasmus recalls blunder during ODI World Cup 2019 final | 2019 ODI World Cup Final Mistake: 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఘోర తప్పిదం

Oknews

Rishabh Pant IPL Comeback | Rishabh Pant IPL Comeback | PBKS vs DC మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్

Oknews

Leave a Comment