తెలుగు సినిమాకి తెలుగు దేశం పార్టీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. కీర్తి శేషులు నందమూరి తారకరామారావు హయాం నుంచే సినీ పరిశ్రమకి చెందిన చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరారు.ఇప్పుడు తాజాగా ప్రముఖ హీరో నిఖిల్ సిద్దార్ధ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
నిఖిల్ స్వయం కృషితో తెలుగు సినిమా పరిశ్రమలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేడు పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు.ఆయన తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టిడిపి (tdp)లో చేరాడు.నిఖిల్ మెడలో పసుపు కండువా కప్పి లోకేష్( nara lokesh) పార్టీ లోకి ఆహ్వానించాడు . ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.మరి ఏపి లో రాజకీయ వాతావరణం వేడెక్కిన దృష్ట్యా నిఖిల్ ని పార్టీ ఎలా వాడుకుంటుందో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.నిఖిల్ మావయ్య కొండయ్య యాదవ్ కి చీరాల టికెట్ కేటాయించడం విశేషం నిఖిల్ ప్రస్తుతం స్వయం భూ అనే హిస్టారికల్ మూవీలో చేస్తున్నాడు. యుద్ధ వీరుడుగా నటిస్తుండటంతో ఈ మూవీ పై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. ఇక నిఖిల్ చేరికతో ప్రత్యర్థి వై సి పి పార్టీ వెన్నులో వణుకు పుడుతుంది. నిఖిల్ లాగానే మరికొంత మంది సినిమా వాళ్ళు టిడిపి లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.