మంచు లక్ష్మి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలుగా 2011 లో అనగనగ ఒక ధీరుడు అనే మూవీ తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసింది. అతీంద్రియ శక్తులున్న ఐరేంద్రి పాత్రలో సూపర్ గా నటించి తండ్రి తగ్గ వారసురాలు అనిపించుకుంది. ఆ తర్వాత ఇతర బాషా చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఆమె కొత్త సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంది.
మంచు లక్ష్మి నయా మూవీ ఆదిపర్వం.. ఆమెనే ప్రధాన పాత్రగా తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోను విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అన్ని భాషల్లోనూ విడుదల అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ విషయం పై చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి మూవీ కోసం మేము పడిన కఠోర శ్రమ మర్చిపోయేలా చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలో సెన్సార్ కు వెళ్లనున్నాం. బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి గారికి థాంక్స్ అని కూడా ఆయన చెప్పాడు.
1974 ,1992 ల మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా ఆదిపర్వం తెరకెక్కింది. మంచు లక్ష్మి తో పాటు ప్రముఖ సంచలన నటి ఎస్తర్ నోరోనా స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. శివకంఠంనేని , ఆదిత్య ఓం,శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు నటించారు. ఘంటా శ్రీనివాసరావు, గోరెంట శ్రావణి, ప్రదీప్ కాటుకూటి, రవి దశిక, రవి మొదలవలస సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఎమ్.ఎస్.కె నిర్మాతగా వ్యవహరించాడు.