Telangana

Komati Reddy denied the allegations made by BJP MLA Maheshwar Reddy | Komatireddy Reaction : మహేశ్వర్ రెడ్డే కాంగ్రెస్‌లోకి వస్తా సాయం చేయమన్నాడు



KomatiReddy Venkat Reddy :  తెలంగాణలో మరో షిండేను అవుతానంటూ తాను గడ్కరీ, అమిత్ షా వద్దకు వెళ్లానంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు.  బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యాలు సత్యదూరమైనవన్నారు. తా ను చెప్పని మాటల్ని చెప్పినట్టు అబద్ధాలు చెప్పి నాపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందని  మండిపడ్డారు. 
మహేశ్వర్ రెడ్డే కాంగ్రెస్‌లో చేరుతానని వచ్చారు !
మొన్నటిదాక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా అన్నా సహాయం చేయమని నన్ను అడిగిన బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. ఇవ్వాల నాపై కామెంట్లు చేస్తున్నడని కోమటిరెడ్డి ఆరోపించారు. తాను   కాంగ్రెస్ లోకి వస్తా మంత్రి పదవి కావాలని అడిగాడు.. అయితే మాకే సరిపడ మెజార్టీ ఉంది. ఎవ్వరిని చేర్చుకోవాలనే ఉద్దేశం పార్టీకి లేదనిర చెప్పానన్నారు.  అది మనసులో పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నడన్నారు.  నితిన్ గడ్కరీకి, అమిత్ షా దగ్గరికి వెళ్లి ఏదో చెప్పిన్నని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నడని..   ఆయనకు దమ్ముంటే నితిన్ గడ్కరిని, అమిత్ షాను తీసుకొని భాగ్యలక్ష్మీ టెంపుల్ కు రమ్మనండి.. నేను వస్తా ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు. 
మహేశ్వర్ రెడ్డి మారని పార్టీ లేదు !
 ఐదేండ్లకో పార్టీ మారే.. గాలిమాటల మహేశ్వర్ రెడ్డి.. రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి జెండా మార్చని నాపై విమర్శలు చేయడం ఏమిటని కోమటిరెడ్డి ప్రశ్నించారు.  ఆయన ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, మధ్యలో బీఆర్ఎస్ తో టచ్.. ఇట్ల ఒక్కటి కాదు ఆయన పోని పార్టీ ఈ రాష్ట్రంలో లేదని గుర్తు చేశారు.  బీజేపీ గేట్లు ఎత్తితే 48 గంటల్లో అన్ని పార్టీలు ఖాళీ అవుతాయి.. ఆరుగురు మంత్రులు మాకు టచ్ లో ఉన్నారు అంటాడు.. మళ్లీ ఆయనే మేం ఎవ్వరిని చేర్చుకోవాలని ప్రయత్నించడం లేదంటాడని..  ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నడని మండిపడ్డారు.  ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ. ప్రపంచంలో ఎక్కడ లేనట్టు.. చేరికల కమిటీకి ఛైర్మన్ ను కూడా నియమించారని అయినా ఒక్క కార్పొరేటర్ కూడా చేరలేదని ఎద్దేవా చేశారు. 
బీజేపీ పాలిత రాష్ట్రాలు మోదీ, షాలకు డబ్బులు పంపుతాయా ? దేశంలో 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, 4 రాష్ట్రాల్లో పొత్తులో అధికారంలో ఉంది. మరీ ఆయా రాష్ట్రాల నుంచి నరేంద్రమోదీకి, నడ్డాకు డబ్బుల మూటలు పంపిస్తున్నరా కోమటిరెడ్డి ప్రశ్నించారు.  ఈ దేశంలో అంబానీ, అదానీలకు ప్రజల సంపదను దోచిపెట్టే బీజేపీ వేరేపార్టీలను విమర్శించడం అంటే..  సిగ్గే నాకు సిగ్గైతాందని సిగ్గుపడ్డట్టు ఉంటదన్నారు.     బీజేపీకి తెలంగాణ ఏర్పడటం ఎప్పుడూ ఇష్టం లేదు. ఒక్కసారి కాదు ఇప్పటికి పదిసార్లు ప్రధానమంత్రి, హోం మంత్రి పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిండని కామెంట్లు చేశారన్నారు. 
మహేశ్వర్ రెడ్డి వ్యాక్యల వెనుక పెద్ద కుట్ర 
 మహేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో ఒక జోకర్ అన్నారు. తానేదో నా సొంత ఇమేజ్ తో గెలిచిన.. బీజేపీ నుంచి నాకొచ్చిన ఫయిదా ఏంలేదని చెప్పాడని..  మా దగ్గర మండలాధ్యక్షున్ని ఎన్నుకోవాలన్నా ఢిల్లీదాక పోవాలే అన్నా.. ఇది పార్టీ కాదు.. అంబానీ, అదానీ కార్పోరేట్ బ్రాంచ్ అని నాతో చెప్పి బాధపడ్డాడని కోమటిరెడ్డి గుర్తు చేసుకున్నారు.  అప్పుడే కాంగ్రెస్ లో ఉంటే ఇయ్యాల మంత్రిని అయ్యేవాన్నని దిగులుపడ్డడాని..  అట్లాంటి వ్యక్తి నన్ను షిండే  అన్నడంటే నాకే విచిత్రం ఉందన్నారు.  అవకాశం ఇస్తే.. రాత్రికి రాత్రే పార్టీ మారుతనని బతిమాలినోడు.. కాంగ్రెస్ లో ఎవ్వరు సప్పుడు చెయ్యకపోయేసరికి నాపై కామెంట్లు చేస్తున్నాడని..  మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యాల వెనక పెద్ద కుట్ర ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.  
 

మరిన్ని చూడండి



Source link

Related posts

CCTV cameras in Anganwadi centres Soon Telangana CM Revanth Reddy

Oknews

తెలంగాణ ఎన్నికల్లో గేరు మార్చిన బీజేపీ – పవన్‌తో కిషన్‌ రెడ్డి భేటీ

Oknews

Ration Card e- KYC Last Date : ఈకేవైసీ పూర్తి చేశారా..? దగ్గరపడిన గడువు, అప్డేట్ చేయకపోతే ‘రేషన్’ కట్..!

Oknews

Leave a Comment