Sports

IPL 2024 LSG vs PBKS Lucknow Super Giants Sets 200 Runs Target


Lucknow Super Giants Sets 200 Runs Target: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ భారీ స్కోరుచేసింది. .నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌, నికోలస్‌ పూరన్‌ చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగారు. చివర్లో కృనాల్ పాండ్యా ధాటిగా  ఆడాడు. మొత్తానికి  పంజాబ్‌ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ప్రారంభంలోనే షాక్‌ తగిలింది. పవర్‌ ప్లే ముగిసేలోపే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్ ( 9 బంతుల్లో 15 పరుగులు)‌, ఆరో ఓవర్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ ( 6 బంతుల్లో 9 పరుగులు ) ఔటయ్యారు. రబాడ వేసిన మూడో ఓవర్‌లో తొలి బంతికి రాహుల్ భారీ షాట్ ఆడగా.. హర్షల్ పటేల్ క్యాచ్‌ మిస్‌ చేశాడు.  దీంతో కాస్తలో బతికిపోయిన రాహుల్ తరువాత నాలుగో ఓవర్లో తప్పించుకోలేక పోయాడు. 
తర్వాత క్వింటన్ డికాక్‌ వరుసగా ఫోర్, సిక్స్‌ బాదాడు. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టాయినిస్‌  కూడా పెద్దగా  రాణించలేకపోయాడు. తర్వాత వచ్చిన నికోలస్‌ పూరన్‌  ఓపెనర్‌ డికాక్‌  కు మంచి పార్టనర్‌షిప్‌ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్‌ అందించారు.   హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్‌ను అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు.  13వ ఓవర్‌లో డికాక్‌ ఔటయిన తర్వాత పూరన్‌ జోరుకు బ్రేక్‌ పడింది. డికాక్‌, పూరన్‌ పరుగుల వేటను కృనాల్‌ పాండ్యా కొనసాగించాడు. ఈ దశలో కృనాల్ పాండ్య కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి లక్నో భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ అప్పటికే పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో 19 ఓవర్‌లో లఖ్‌నవూ వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది.  మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్ లో సామ్ కరన్ 3 వికెట్లతో చెలరేగాడు. అర్ష్దీప్సింగ్ కు రెండు వికెట్లు దక్కాయి. రబాడా, రాహుల్ చాహర్ తలో వికెట్ సంపాదించారు.

పంజాబ్‌ జోరు సాగేనా..?
ఇప్పటివరకూ రెండు మ్యాచులు ఆడి ఒక విజయం నమోదు చేసిన పంజాబ్‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విజయ యాత్ర కొనసాగించాలని పట్టుదలతో ఉంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని జట్టు పవర్‌ప్లేలో మరింత ధాటిగా ఆడాలని చూస్తోంది. జానీ బెయిర్‌స్టో ఫామ్‌లోకి వస్తే పంజాబ్‌కు ఇది కష్టం కాకపోవచ్చు. ధావన్ తన స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బెంగళూరు మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసినట్లు స్వయంగా అంగీకరించిన ధావన్‌.. ఈమ్యాచ్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేయాలని చూస్తున్నాడు. ప్రభసిమ్రాన్ సింగ్ మంచి ఆరంభాలు వస్తున్నా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోతున్నాడు. శామ్ కరణ్‌ రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో తన సత్తా చాటినా బౌలర్‌గా విఫలం కావడం పంజాబ్‌ను ఆందోళన పరుస్తోంది. 

మరిన్ని చూడండి



Source link

Related posts

Sunrisers Hyderabad Captain Pat Cummins: ప్యాట్ కమిన్స్ ను కెప్టెన్ గా నియమించిన సన్ రైజర్స్… మార్ క్రమ్ ను తప్పించిన ఫ్రాంచైజీ

Oknews

అనుకున్నది సాధించి.. చరిత్ర సృష్టించిన భారత్.. సెంచరీ చేరిన పతకాలు.. తెలుగమ్మాయికి మూడో స్వర్ణం-india bags 100 medals in asian games for first time in history ,స్పోర్ట్స్ న్యూస్

Oknews

Virat Kohli Batting T20 World Cup 2024 | Virat Kohli Batting T20 World Cup 2024 | సెమీ ఫైనల్లోనైనా కింగ్ కమ్ బ్యాక్ ఇస్తాడా..?

Oknews

Leave a Comment