Sports

GT vs SRH IPL 2024 Match Preview and Prediction


IPL 2024 GT vs SRH Match Preview and  Prediction: ముంబై ఇండియన్స్‌(MI)తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌(IPL2024) చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసి ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)… మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో సన్‌రైజర్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ముంబై బౌలర్లను ఊచకోత కోసిన హైదరాబాద్‌ బ్యాటర్లు… గుజరాత్‌ టైటన్స్‌తో  మరోసారి అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు. ముంబైతో పోలిస్తే బలహీనంగా ఉన్న గుజారాత్‌ బౌలింగ్‌ దళం… హైదరాబాద్‌ బ్యాటర్లను అడ్డుకోగలదా అన్నదే ఇప్పుడు అందిరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. 

 

సన్‌రైజర్స్‌ బ్యాటర్లపైనే అందరి దృష్టి

గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ చరిత్రలోని ఎన్నో రికార్డను బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లో అర్థ శతకం చేసి ఐపీఎల్‌లో హైదరాబాద్‌ తరపున వేగవంతమైన హాఫ్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో వీరు మరోసారి ఇలాగే రాణించాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. మార్ర్కమ్‌, హెన్రిచ్ క్లాసెన్ కూడా బ్యాటు ఝుళిపిస్తే గుజరాత్‌ బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. కానీ ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్‌లతో వీరికి ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ మధ్యాహ్నం జరగనుండడంతో స్పిన్నర్లు రషీద్, సాయి కిషోర్ కీలకంగా మారనున్నారు. అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే వీలుంది. . సన్‌రైజర్స్‌ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టును బాగానే నడిపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో షాబాజ్ అహ్మద్‌, అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్‌లను చక్కగా వినియోగించుకున్నాడు. కమిన్స్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నాడు. 

 

గుజరాత్‌ బౌలర్లు ఏంచేస్తారో..?

ముంబైతో మ్యాచ్‌ తర్వాత భీకరంగా మారిన హైదరాబాద్‌ బ్యాటర్లను గుజరాత్‌ బౌలర్లు ఏ మేరకు అడ్డుకోగలరో చూడాలి. ముంబై ఇండియన్స్‌పై తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్‌… రెండో మ్యాచ్‌లో  చెన్నై చేతిలో పరాజయం పాలైంది. గాయపడిన మహ్మద్ షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేష్ యాదవ్ అంచనాలను అందుకోలేక పోతున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో 63 పరుగుల ఘోర ఓటమితో గుజరాత్‌ రన్‌రేట్‌ -1.425కి పడిపోయింది. వృద్ధిమాన్ గిల్‌, సాహా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియాల్లో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.  గిల్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం కాడవం కూడా గుజరాత్‌ను ఆందోళన పరుస్తోంది. మిల్లర్ ఫామ్‌ కూడా అలాగే ఉంది. గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఆల్‌రౌండ్‌గా అన్ని విభాగాల్లో పటిష్టం కావాల్సి ఉంది. 

 

జట్లు

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ మింజ్, కేన్ విలియమ్సన్, అభినవ్ మంధర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, శాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, మానవ్ సుతార్. 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.

మరిన్ని చూడండి



Source link

Related posts

Rahul Dravid Reveals Why Team India Lost To England In Hyderabad Test

Oknews

Sunrisers Hyderabad Team Has Registered New Records In History Of Ipl

Oknews

IndU19 vs AusU19 Worldcup Final Result : అండర్ 19వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి | ABP Desam

Oknews

Leave a Comment