ByGanesh
Sun 31st Mar 2024 03:50 PM
మెగాస్టార్ చిరంజీవి-బింబిసార దర్శకుడు వసిష్ఠ కలయికలో యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న భారీ పిరియేడికల్ డ్రామా విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.మెగాస్టార్ చిరు-సురేఖ గారు విహార యాత్రలకి వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ చిరు వసిష్ఠకి ఇంకా అందుబాటులోనే ఉన్నారట. మే లో ఆయన తన భార్య సురేఖ గారితో యూరప్ ట్రిప్ కి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం త్రిష ని 18 ఏళ్ళ తర్వాత చిరుకి జోడిగా తీసుకొచ్చారు. అలాగే మరో ఇద్దరు భామలు చిరుకి సిస్టర్స్ గా కనిపించబోతున్నారు.
అయితే ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. రేపు సోమవారం నుంచి హైదరాబాద్ లో డిఫరెంట్ లోకేషన్స్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అది ఇంటర్వెల్ బ్లాక్ అయ్యి ఉండొచ్చు… ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అయ్యుండొచ్చు అనే టాక్ నడుస్తుంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరు డూప్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొనబోతున్నారనే వార్త మెగా అభిమానులని షేక్ చేసింది. చిరు ఈ వయసులోను యాక్షన్ అండ్ డాన్స్ విషయంలో తన గ్రేస్ చూపిస్తూనే ఉన్నారు. ఇక విశ్వంభర షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 10 సంక్రాంతి స్పెషల్ గా విడుదల చెయ్యాలని మేకర్స్ ఎప్పుడో డిసైడ్ అయ్యారు.
Vishwambhara Hyderabad Schedule update :
Vishwambhara shooting update