GT vs SRH Gujarat Titans won the Match: ముంబై(MI)పై ఘన విజయంతో టైటిల్‌పై ఆశలు రేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)… గుజరాత్(GT)తో జరిగిన పోరులో తేలిపోయింది. సమష్టి వైఫల్యంతో మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని గుజరాత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఒక్కరి స్కోరు 30 దాటలే ?
గత మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో అలరించిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. గుజరాత్‌పై భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. మంచి ఆరంభాలే దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగుల మార్క్‌ను దాటలేదు. ఒమర్జాయ్ వేసిన తొలి ఓవర్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 11 పరుగులు వచ్చాయి. ట్రావిస్ హెడ్ వరుసగా రెండు ఫోర్లు బాది మరోసారి భారీ స్కోరు అందించేలానే కనిపించాడు. కానీ జట్టు స్కోరు 34 పరుగుల వద్ద 17 బంతుల్లో 16 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను అజ్మతుల్లా ఒమర్జాయ్ అవుట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ శర్మ… వరుసగా రెండు సిక్సర్లు బాది మంచి టచ్‌లో కనిపించాడు. రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో అభిషేక్ వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు. పవర్ ప్లే పూర్తయ్యే సరికి హైదరాబాద్ 56 పరుగులు చేసింది. ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. తర్వాత దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి రషీద్ ఖాన్ వేసిన 14 ఓవర్‌లో నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే ఐడెన్ మార్‌క్రమ్ కూడా 17 పరుగులు చేసి ఔటయ్యాడు. దర్శన్ నల్కండే వేసిన 19 ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. చివర్లో సమద్ 14 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సుతో 29 పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
గుజరాత్ తేలిగ్గానే..?
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు అదిరే ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు వృద్ధిమాన్ సాహా-శుభ్‌మన్ గిల్ 36 పరుగులు చేశారు. వీరిద్దరూ నాలుగు ఓవర్లలోనే 36 పరుగులు జోడించారు. సాహా 13 బంతుల్లో 1 ఫోర్, రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి షెహబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సాయి సుదర్శన్ 45, శుభ్‌మన్ గిల్ 36 పరుగులు చేసి అవుటయ్యారు. ఆ తర్వాత విజయ్ శంకర్‌తో కలిసి డేవిడ్ మిల్లర్ లక్ష్యాన్ని ఛేదించాడు. మిల్లర్ 44 పరుగులతో అజేయంగా నిలిచి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. విజయ్ శంకర్ 14 పరుగులతో అజేయంగా నిలవడంతో లక్ష్యాన్ని గుజరాత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరబాద్ బౌలర్లలో షెహబాజ్ అహ్మద్1, మార్కండే 1, కమ్మిన్స్ ఒక వికెట్ తీశారు.
మరిన్ని చూడండి