Entertainment

భగవద్గీత గొప్పదనాన్ని చెప్పే చిత్రం ‘డివైన్ మెసేజ్ 1’ చేస్తున్న దర్శకుడు సంతోష్ జాగర్లపూడి!


ఏదైనా ఒక విషయాన్ని చాలా డీప్ గా చెప్పాలన్నా, చాలా ఎక్కువ మందికి తెలిసేలా చెప్పాలన్నా.. దానికి చాలా మంది సినిమాని మాధ్యమంగా వాడుకుంటూ ఉంటారు. అందుకే సినిమా దర్శకులు ఎక్కువగా ఒక మెసేజ్ ని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇలాంటి క్రమంలోనే ఇస్కాన్ వారు కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ కి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఒక సినిమాని రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ముందుగా ఒక షార్ట్ ఫిలిం ని తెరకెక్కించాలని ప్రయత్నం చేశారు.

అందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు అయిన సంతోష్ జాగర్లపూడికి ఈ షార్ట్ ఫిలిం ని తెరకెక్కించే బాధ్యతని అప్పగించారు. దీనికి కథ సచినందన్ హరిదాస్ అందించారు. సీతారాం ప్రభు నేతృత్వంలో హైదరాబాద్ లోని అత్తాపూర్ ఇస్కాన్ ఆలయంలో దీనిని చిత్రీకరించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ షార్ట్ ఫిలిం పేరు “డివైన్ మెసేజ్ 1” గా నిర్ణయించారు. ఇది త్వరలోనే అమెజాన్ తో సహా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో  అందుబాటులో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 

‘సుబ్రహ్మణ్యపురం’, ‘లక్ష్య’ వంటి సినిమాలకు దర్శకత్వం వహిచిన సంతోష్ జాగర్లపూడి ప్రస్తుతం సుమంత్ హీరోగా ‘మహేంద్ర గిరి వారాహి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణకు సహకరించిన హైదరాబాద్ లోని ఇస్కాన్ అత్తాపూర్ టెంపుల్ మేనేజ్మెంట్ కు చిత్రబృందం కృతజ్ఞతలు తెలియచేసింది.



Source link

Related posts

చంద్రబాబుకి బ్యాడ్ టైం నడుస్తుంది.. సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Oknews

పువ్వుని ముద్దాడుతూ తమన్నా.. చాలా హాట్ గురు!

Oknews

Power Search across the Web – Feedly Blog

Oknews

Leave a Comment