EntertainmentLatest News

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘Case No 15’ ట్రైలర్ విడుదల


బి.జి. వెంచర్స్ పతాకంపై అజయ్, రవి ప్రకాష్, హర్షిణి, మాండవియా సెజల్ నటీనటులుగా తడకల వంకర్ రాజేష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్  “Case No 15”. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా  చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా, టి.ఎఫ్.సి.సి ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చిత్ర టీజర్ ను, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “రాజేష్ తన మొదటి సినిమా నుండి నాతో డిస్కస్ చేసేవాడు. ఏదో ఒక సినిమా తీసి చుట్టేదాంలే అనుకోకుండా మంచి క్వాలిటీ సినిమా తియ్యాలని తపన పడతాడు. బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి ఆర్టిస్టులతో, మంచి టెక్నిషియన్స్ తో తీసిన ఈ సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వంటి మంచి కాన్సెప్ట్ తో  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రాజేష్ కు బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

టి.యఫ్.సి.సి. ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “మంచి ప్యాడింగ్ తో తీసిన ఈ సినిమాలో నటీనటులు అందరూ చాలా కసిగా నటించారు. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. మంచి క్వాలిటీతో తీసిన రాజేష్ కు ఈ సినిమా మంచి పేరుతో పాటు మంచి విజయాన్ని కూడా అందుకోవాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ… “దర్శక, నిర్మాత అయిన రాజేష్ నిరంతర యోధుడులా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు నిర్మిస్తాడు. మంచి ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నిషియన్స్ తో తీసిన ఈ “Case No 15″  సినిమా టీజర్, ట్రైలర్, లిరిక్స్ చాలా  బాగున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రాజేష్ కు మంచి పేరును తీసుకురావాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత తడకల వంకర్ రాజేష్ మాట్లాడుతూ.. “మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు జాన్ మంచి మ్యూజిక్ ఇస్తే, ఆనం వెంకట్ గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాలో ప్రతి సీన్ చూసే ప్రేక్షకులను ఉత్కంఠ కు గురి చేయడమే కాకుండా మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము” అన్నారు.

నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. “పోలీస్ క్యారెక్టర్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ లో నటిద్దాం అనుకున్న నాకు రాజేష్ గారు చెప్పిన ‘Case no 15’ చాలా ఇంట్రెస్ట్ ను కలిగించింది. ఈ రోజు ఈ సినిమా చాలా బాగా వచ్చింది అంటే డానికి కారణం రాజేష్ గారే. అయన మంచి తనానికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.” అన్నారు. 

చిత్రం శ్రీను మాట్లాడుతూ… “రాజేష్ గారు తీసే ప్రతి సినిమాలో నాకు  తప్పకుండా ఒక రోల్ ఇస్తారు. ఇందులో కూడా నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమా తనకు మంచి పేరుతో పాటు డబ్బు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. 

హీరోయిన్ మాండవియా సెజల్ మాట్లాడుతూ.. “ఇలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత రాజేష్ గారికి నా ధన్యవాదాలు” అన్నారు.

చమక్ చంద్ర, చిత్రం శ్రీను, అప్పారావు, గడ్డం నవీన్, కె. ఏ పాల్ ఫేమ్ రాము, జూనియర్ రాజశేఖర్, పవిత్ర, కవిత, రేఖ తదితరులు నటించిన ఈ చిత్రానికి జాన్ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా ఆనం వెంకట్, ఎడిటర్ గా ఆర్.కె.స్వామి వ్యవహరిస్తున్నారు.



Source link

Related posts

'కల్కి' ముందు కొండంత టార్గెట్.. ప్రభాస్ ఏం చేస్తాడు?

Oknews

Latest Gold Silver Prices Today 06 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Latest Gold-Silver Prices Today: చుక్కలు చూపిస్తున్న గోల్డ్‌

Oknews

వైద్యారోగ్యశాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.!

Oknews

Leave a Comment