ఒకే ఒక్క సినిమాతో స్టార్ డం సంపాదించిన హీరోలు చాలా మందే ఉంటారు. కానీ హీరోయిన్ లు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన హీరోయిన్ లలో ఒకరు రష్మిక. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలతో జత కట్టి నెంబర్ వన్ ప్లేస్ లో నిలబడింది. తాజాగా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
రష్మిక ప్రస్తుతం బన్నీ హీరోగా వస్తున్న పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ మూవీస్ లో చేస్తుంది. గర్ల్ ఫ్రెండ్ మాత్రం తనే టైటిల్ రోల్ గా తెరకెక్కుతుంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో గర్ల్ ఫ్రెండ్ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ,హిందీ భాషల్లో ఆ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఫస్ట్ టీజర్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. పైగా ఆ రోజు రష్మిక పుట్టిన రోజు కూడా. ఐదు భాషల్లోను టీజర్ విడుదల అవుతుంది. వాటన్నింటికి రష్మిక నే సొంతంగా డబ్బింగ్ చెప్పింది. అంటే ఐదు బాషల్లోనూ రష్మిక వాయిస్ తో టీజర్ మెరవబోతుంది. దీంతో సినిమా పట్ల రష్మిక కి ఉన్న కమిట్ మెంట్ ని అందరూ మెచ్చుకుంటున్నారు.
రాహుల్ రవీంద్రన్ ‘గర్ల్ ఫ్రెండ్’కి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో చిలసౌ, మన్మధుడు 2 కి దర్శకత్వం వహించాడు. రష్మిక ఇటీవలే యానిమల్ తో భారీ విజయాన్ని అందుకొని వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు ని పొందింది. అందుకు నిదర్శనమే ఇటీవలే ఆమె చేసిన జపాన్ పర్యటన. జపాన్ లోని ప్రసిద్ధ క్రంచైరోల్ అనిమే అవార్డ్స్‌లో పాల్గొని మొట్టమొదటి ఇండియన్ నటిగా చరిత్ర సృష్టించింది. ఈ విషయాలన్నీ అటుంచితే ‘గర్ల్ ఫ్రెండ్’ టీజర్ విడుదలవుతున్న ఏప్రిల్ 5నే ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల కానుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రష్మిక అతిథి పాత్రలో మెరవనుంది సమాచారం. ఓ వైపు ‘గర్ల్ ఫ్రెండ్’ టీజర్, మరోవైపు ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదల.. మరి వీటిలో ఆడియన్స్ మెప్పు పొందేది ఏదో చూడాలి.