దిశ, ఫీచర్స్ : స్త్రీలకు ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే గైనకాలజిస్టులను సంప్రదిస్తూ ఉంటారు. అలా సంప్రదించినప్పుడు కూడా లైంగిక, పునరుత్పత్తి గురించిన కొన్ని సమస్యలను చెప్పుకోవడానికి సిగ్గు పడుతూ ఉంటారు. అంతే కాదు వైద్యులు కొన్ని విషయాల గురించిన వివరాలను అడిగితే వాటిని దాచిపెడతారు. అలా చేయడం ద్వారా మహిళలు భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. లైంగిక ఆరోగ్య శ్రేయస్సు కోసం గైనకాలజిస్ట్‌ల దగ్గర ఎలాంటి విషయాలను కూడా దాచకూడదంటున్నారు. మరి దాచకూడని రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పీరియడ్స్..
పీరియడ్స్ సమయంలో మీకు భరించలేని నొప్పి ఉంటే, మీ గైనకాలజిస్ట్ నుండి ఈ విషయాన్ని ఎప్పుడూ దాచకండి. ఎందుకంటే ఇది ఎండోమెట్రియోసిస్ లేదా గర్భాశయ ఫైబ్రాయిడ్లకు కూడా సంకేతం కావచ్చు.
యోని వాసన..
యోనివాసన గురించి మీ వైద్యులతో మాట్లాడటం అసౌకర్యంగా అనిపించవచ్చు. అయినా దీని గురించి మీ గైనకాలజిస్ట్‌తో మాట్లాడటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా పెరుగుదల లేదా యోని సంక్రమణకు సంకేతం కావచ్చు.
యోని గోడలలో వాపు..
మీ యోని గోడలలో ఏదైనా వాపు లేదా పెరుగుదలను మీరు గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యులని సంప్రదించాలి.
లైంగిక విషయాలు..
లైంగిక అసౌకర్యం గురించిన విషయాలను గైనకాలజిస్ట్‌తో మాట్లాడటం చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి వారు వైద్యం అందించి సహాయం చేయగలరు.
యూరినరీ లీకేజ్..
చాలా మంది మహిళలు బిడ్డ పుట్టిన తర్వాత యూరిన్ లీకేజ్ సమస్యతో బాధపడుతుంటారు. ఇది మీ దినచర్యలో అడ్డంకిగా మారవచ్చు. అందుకే ఈ సమస్యను మీ డాక్టర్‌తో పంచుకోవడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు.
తక్కువ లిబిడో..
చాలా మంది మహిళలకు సెక్స్ చేయాలనే కోరిక లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఇలాంటి విషయాలు మీ గైనకాలజిస్ట్‌తో పంచుకుంటే వారు మీకు మార్గం చూపిస్తారు.
Read More..
సెక్స్ చేస్తున్నప్పుడు మరణం.. ఈ సమస్యే కారణం.. మీలోనూ ఉంటే..