దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో బిజీగా ఉంటున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు గ్యాప్ లేకుండా ఏదొక పనులు చేసుకుంటూ బిజీ అవుతున్నారు. ఒకప్పుడు రెండు పొయ్యిలు ఉన్న గ్యాస్ స్టవ్ సరిపోయేది. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇద్దరూ జాబ్స్ చేస్తున్నారు. ఆఫీసుకు వెళ్లడమో, పిల్లలను బడికి తీసుకెళ్ళడమో చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. పనులు తొందరగా అవ్వాలంటే రెండు బర్నర్ గ్యాస్ స్టవ్ సరిపోదు. అందుకే 3-బర్నర్, 4-బర్నర్ గ్యాస్ స్టవ్స్ వాడుతున్నారు.
పాత కాలంలో వంట ఎక్కడైనా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. అన్నీ వంటగదిలోనే చేయాలి. టిఫిన్ దగ్గర నుంచి అన్నం, పప్పు, ఇలా అన్ని ఒకే దాని మీద చేసుకోవాలి. అందువల్ల, రెండు గ్యాస్ స్టవ్‌లు ఎక్కడా సరిపోవు. ఈ కారణంగా, ఇటీవల కొంతమంది ఇళ్లలో 3 బర్నర్ గ్యాస్ స్టవ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని అంశాలు వదిలేస్తూ.. మరికొన్ని వాటికి అనుగుణంగా నడుచుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మూడు గ్యాస్ పొయ్యిలు ఉండటం వల్ల ఎటువంటి హాని జరగదని చెబుతున్నారు.
Read More..
ఈ ఆలయంలో అంతుచిక్కని మిస్టరీలు.. నూనె, వత్తి లేకుండా నిత్యం వెలుగుతున్న జ్వాలలు..