EntertainmentLatest News

వరుసగా మూడు.. ఇక మృణాల్ ఆగదేమో..!


ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల పక్కన నటించడానికి హీరోయిన్ల కొరత ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అయితే ఆ లోటుని భర్తీ చేయడం కోసమే అన్నట్టుగా అందాల నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అడుగులు పడుతున్నాయి.

హిందీలో పలు సినిమాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది మృణాల్. ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ‘సీతారామం’ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా.. మృణాల్ కి ఎంతో పేరు తీసుకొచ్చింది.

ఇక రెండో సినిమాగా ‘హాయ్ నాన్న’లో నాని(Nani) సరసన నటించింది మృణాల్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొంది మంచి విజయం సాధించింది. ఇలా తెలుగులో నటించిన మొదటి రెండు సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకున్న మృణాల్.. ఇప్పుడు మూడో సినిమాతో అలరించడానికి సిద్ధమైంది. అదే ‘ఫ్యామిలీ స్టార్’.

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్'(Family Star) చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలు అందుకొని ఈ సినిమా విజయం సాధిస్తే.. మృణాల్ తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్లు అవుతుంది. అదే జరిగితే ఇప్పటిదాకా యంగ్ స్టార్స్ పక్కన నటించిన మృణాల్ పై టాప్ స్టార్స్ దృష్టి కూడా పడే అవకాశముంది. మీడియం, బిగ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. 

మరోవైపు మృణాల్ కూడా తెలుగు సినిమాల పట్ల ఎంతో చూపిస్తోంది. తెలుగులో వస్తున్న కథలు తనకు ఎంతగానో నచ్చుతున్నాయని చెబుతోంది. ఓ వైపు అందం, అభినయం.. మరోవైపు ఆసక్తి కూడా తోడవ్వడంతో వరుస అవకాశాలతో త్వరలోనే మృణాల్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగినా ఆశ్చర్యంలేదు.



Source link

Related posts

ఇది ప్రభాస్ పేరే కదా.. హీరోయిన్ పొడిపించుకుంది 

Oknews

నటనకి బ్రేక్ ఇవ్వనున్న బాలకృష..నో కాంప్రమైజ్ 

Oknews

జబర్దస్త్ పై కమెడియన్ సెన్సేషనల్ కామెంట్స్

Oknews

Leave a Comment