Telangana

Adibhatla police arrested Kalvakuntla Kanna Rao | కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు అరెస్ట్



Adibhatla police arrested Kalvakuntla Kanna Rao   :   తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.  భూకబ్జా, హత్యాయత్నం ఆరోపణలతో ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసు విషయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.   కేసును కొట్టేయాలంటూ  కల్వకుంట్ల కన్నారావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. రాజకీయ కక్షలతో  చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్న పిటిషనర్‌ వాదనను  కోర్టు తిరస్కరించింది.  చట్టప్రకారం  దర్యాప్తు కొనసాగిం చాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 
మన్నెగూడ వద్ద రెండెకరా ల ల్యాండ్‌ను కన్నారావు మరో 30 మంది కలిసి కబ్జాకు యత్నించా రంటూ ఓఎస్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ బండోజు శ్రీనివాస్‌ ఫిర్యాదు  చేశారు.    రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఆదిభట్ల పీఎస్ పరిధిలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్నొన్నారు. కన్నారావుతో పాటు మరో 38 మంది బీఆర్ఎస్ నేతల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద కేసు నమోదు చేశారు. ఫెన్సింగ్ రాళ్లను తొలగించి, హద్దు రాళ్లను పెట్టినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 38 మందిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 35 మంది పరారీలో ఉన్నారు.  
వివాదం ఏమిటంటే ?  జక్కిడి సురేందర్‌రెడ్డి అనే వ్యక్తికి అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మన్నెగూడ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 32లో వేద కన్వెన్షన్‌ ఎదురుగా 2.15 గుంటల భూమి ఉంది. సురేందర్‌రెడ్డి ఆ భూమిని చామ సురేష్‌ అనే వ్యక్తి దగ్గర దాదాపు కోటి రూపాయలు తీసుకొని 2013లో జీపీఏ చేశాడు. తిరిగి డబ్బులు చెల్లించాక భూమిని తనపేరున చేసేలా ఒప్పందం చేసుకున్నాడు. రెండు నెలల తర్వాత సురేష్‌ భూమిని సెల్ఫ్‌ రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాడు. ఈక్రమంలో తిరిగి డబ్బులు చెల్లిస్తానని చెప్పిన సురేందర్‌ రెడ్డి.. 2020 వరకు తిరిగి ఇవ్వకపోవడంతో సురేష్‌ ఓఎ్‌సఆర్‌ గ్రూప్‌ అనే సంస్థ డైరక్టర్‌ శ్రీనివా్‌సకు భూమిని రిజిస్ర్టేషన్‌ చేశాడు. 2020 నుంచి ఇప్పటివరకు ఆ భూమి ఓఎ్‌సఆర్‌ గ్రూప్‌ సంస్థ అధీనంలోనే ఉంది. జక్కిడి సురేందర్‌రెడ్డి.. చామ సురే్‌షతో భూమి విషయం తేల్చుకుంటామని, మధ్యలో మీరెందుకు భూమిని కొన్నారంటూ ఓఎ్‌సఆర్‌ గ్రూప్‌ సంస్థ డైరక్టర్‌ శ్రీనివా‌స్ తో తరచూ గొడవకు దిగుతూ భూమి హద్దులు తొలగించడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. సురేందర్‌రెడ్డితో పాటు అతడి సోదరులపై గతంలో కేసులు నమోదయ్యాయి.  
సెటిల్మెంట్‌కు ప్రయత్నించిన కన్నారావు 
బొల్లారంలో ఉండే సురేష్‌ మామ చంద్రారెడ్డి ద్వారా మాజీ సీఎం కేసీఆర్‌ బంధువు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావును కలిశాడు. భూ వివాదంలో జోక్యం చేసుకుని సర్ధుబాటు చేయడానికి కొంత డబ్బు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో కొంత అడ్వాన్స్‌గా ఇచ్చి 2021లో ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం(దాదాపు రూ.2 కోట్లు మాట్లాడుకోగా.. అడ్వాన్స్‌గా రూ.40 లక్షలు తీసుకున్నట్లు సమాచారం). ఒప్పందం కుదుర్చుకొని రెండేళ్లు గడిచినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో.. జక్కిడి సురేందర్‌ రెడ్డి కన్నారావుపై ఒత్తిడి పెంచారు. ఈనెల 3న తెల్లవారుజామున 3 గంటలకు కల్వకుంట్ల కన్నారావు అతడి అనుచరులు డానియేలు, శివలతో పాటు సుమారుగా నలభైౖ మంది వరకు వచ్చి.. భూమి వద్ద వాచ్‌మన్‌, సెక్యూరిటీ గార్డులపై దాడిచేసి గాయపరిచారు. అక్కడ వాచ్‌మెన్‌ కోసం వేసిన గుడిసెను తగలబెట్టి జేసీబీ సాయంతో భూమి చుట్టూ ఏర్పాటుచేసిన ప్రీకాస్ట్‌ ప్రహరీని కూల్చి వేశారు.  

మరిన్ని చూడండి



Source link

Related posts

TS Mega DSC 2024 Applications: నేటి నుంచి తెలంగాణ డిఎస్సీ 24 దరఖాస్తుల స్వీకరణ… ఏప్రిల్ 3వ తేదీ వరకు గడువు

Oknews

గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా..? పరీక్షా విధానం, సిలబస్ ఇదే-check the syllabus and exam patern for tspsc group 1 exam 2024 ,తెలంగాణ న్యూస్

Oknews

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం.!

Oknews

Leave a Comment