దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు మన చుట్టుముడుతున్నాయి. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు పెద్దవారు. అయితే చాలా మందికి అన్నం తిన్న వెంటనే కడుపులో నొప్పి, తిమ్మిరి లాంటి సమస్యలు వస్తుంటాయి. కానీ ఇది మామూలు అన్నట్లే వదిలేస్తారు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలే నెగ్లెట్ చేయకూడదు అంటున్నారు వైద్యులు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలంట.
తిన్న తర్వాత కడుపు నొప్పి రావడానికి అల్సర్ ఒక కారణం కావచ్చునంట. దీని వలన తిన్న తర్వాత కడుపులో నొప్పి వస్తుంది. అంతే కాకుండా సరైన టైమ్‌కి ఫుడ్ తినకపోవడం వలన కూడా ఈ నొప్పి వస్తుంది. కడుపు సంబంధిత వ్యాధులలో ఇదొక్కటి. దీని వలన పేగులలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ రకమైన నొప్పి వస్తే ఎక్కువగా మసాలా ఫుడ్ తినకుండా ఉండాలంట. అంతే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా తిన్న తర్వాత కడుపు నొప్పి, తిమ్మిరి లాంటి సమస్యలు వస్తాయి. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే ఇది చాలా తీవ్రంగా మారే అవకాశం ఉంటుదంట. అలాగే పెద్ద పేగులో ఏవైనా సమస్యలు ఉన్నా, తిన్న తర్వాత కడుపు నొప్పి రావడం జరుగుతుందంట. అందువలన ఈ నొప్పి కంటిన్యూగా వస్తుంటే వైద్యుడిని సంప్రదించాలి అంటున్నారు నిపుణులు.