Sports

RCB vs LSG IPL 2024 Match Royal Challengers Bengaluru opt to bowl


RCB vs LSG IPL 2024 Match  Royal Challengers Bengaluru opt to bowl:  ఐపీఎల్(IPL) 17 సీజన్‌లో భాగంగా  బెంగళూరు(RCB), లఖ్‌నవూ(LSG)  తలపడనున్నాయి. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌ టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం తర్వాత బెంగళూరు(RCB) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది.  విరాట్ కోహ్లీ(Kohli) ఒక్కడే స్థిరంగా రాణిస్తుండడం మినహా మిగిలిన విభాగాల్లో తేలిపోతున్న బెంగళూరు.. ఈ మ్యాచ్‌లో అన్ని సమస్యలను పరిష్కరించుకుని విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ ప్రస్తుతం మూడు మ్యాచుల్లో ఒకే విజయంతో  రెండు పాయింట్లు సాధించి  పాయింట్లు పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమి తర్వాత బెంగళూరు నెట్‌ రన్‌రేట్‌ భారీగా పడిపోయింది.  గత మ్యాచ్ లో బ్రేక్ తీసుకున్న రాహుల్ ఈ మ్యాచ్ లో బరిలో దిగనున్నాడు.

 

బ్యాటింగ్‌ కష్టాలు తీరుతాయా..?

బెంగళూరు సారధి ఫాఫ్ డుప్లెసిస్ పరుగులు చేసేందుకు కష్టపడుతున్నాడు, RCB బ్యాటింగ్ లైనప్‌ పేపర్‌ మీద బలంగా కనిపిస్తున్నా  మైదానంలో కోహ్లీ ఒక్కడే పోరాడుతున్నాడు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో స్థిరంగా రాణిస్తున్నాడు. డు ప్లెసిస్, రజత్‌ పాటిదార్‌,  గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్ దారుణంగా విఫలమవుతున్నారు. కానీ దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్‌లు రాణిస్తుండడంతో లోయర్‌ ఆర్డర్‌ పర్వాలేదనిపిస్తోంది. బెంగళూరు జట్టులో సీనియర్ బ్యాటర్ల వైఫల్యం… సీనియర్ల బౌలర్లకు పాకాయి. మహమ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమతున్నాడు. బెంగళూరు జట్టులో లీడ్ పేసర్ అయిన సిరాజ్‌ మూడు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు, సిరాజ్‌ ఓవర్‌కు 10 పరుగులు ఇచ్చాడు. IPL 2023 సమయంలో  స్థిరంగా రాణించిన సిరాజ్‌… ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 

 

జట్లు 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భండగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. 

 

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్.

మరిన్ని చూడండి



Source link

Related posts

Gujarat Titans Captain Shubman Gill fined RS 12 Lakh

Oknews

We have let the entire nation down Angelo Mathews on Sri Lankas early exit from T20 World Cup

Oknews

Davis Cup Ramkumar Ramanathan rallies to win India vs Pakistan

Oknews

Leave a Comment