Telangana

కరీంనగర్ జిల్లాలో విషాదం, 11 నెలల బిడ్డకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య-karimnagar crime in telugu mother commits suicide after killed infant family disputes reason ,తెలంగాణ న్యూస్



తల్లిదండ్రులు టీచర్స్..భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగికరీంనగర్ (Karimnagar)సమీపంలోని విజయనగర్ కాలనికి చెందిన గాదె జయప్రద వెంకటేశ్వరచారి దంపతులిద్దరూ టీచర్స్. కూతురు శ్రీజను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నరేష్ కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. ఇటు తల్లిదండ్రులు, అటు భర్త ఉద్యోగులే కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది శ్రీజ. బాబు పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ (Hyderabad)లో ఉద్యోగం చేస్తున్న భర్త నరేష్ శ్రీజ మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయని స్థానికులు తెలిపారు. క్షణికావేశంతో శ్రీజ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. భర్తపై కోపంతో బాబుకు విషమిచ్చి తాను విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కూతురు, మనవడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో శ్రీజ తల్లి తీవ్ర మనస్థాపానికి గురై విషం మింగి ప్రాణాపాయ స్థితికి చేరింది. వెంటనే స్థానికులు జయప్రదను అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



Source link

Related posts

Gold Silver Prices Today 07 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: కొత్త రికార్డ్‌ దిశగా పసిడి పరుగు

Oknews

TS Traffic Challan : వాహనదారులకు అలర్ట్- చలాన్లపై డిస్కౌంట్ గడువు మరోసారి పెంపు

Oknews

CM Revanth Reddy T Safe: సచివాలయంలో టీ-సేఫ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Oknews

Leave a Comment