Bijapur Encounter Updates: తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్(Bijapur Encounter) జరిగింది. 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి నిత్యావసర సరుకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్చోలి-లేంద్ర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో బీజాపూర్ DRG, CRPF, STF, COBRA బృందాలు కూంబింగ్ చేపట్టగా ఎందురు కాల్పులు జరిగాయి. పోలీస్ బృందాలకు మావోయిస్టులకు మధ్య సుమారు ఎనిమిది గంటల పాటు ఎదురుకాల్పులు జరినట్లు సమాచారం. కాల్పుల అనంతరం పోలీసులు సెర్చ్ చేయగా ముగ్గురు మహిళలతో సహా 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. సంఘటన స్థలం నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, ఒక ఏకే 47, LMG ఆయుధం, 303 బోర్ రైఫిల్, 12 బోర్ రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, భారీ పరిమాణంలో BGL షెల్స్, విప్లవ సాహిత్యం, నిత్యావసర సరుకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 13 మంది మావోయిస్టుల మృతదేహాలను బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. చనిపోయిన మావోలు ఎక్కువ మంది PLGA కంపెనీ నంబర్ 02 కి చెందిన వారేనని ప్రాథమికంగా తెలుస్తోంది.
Source link