Health Care

షాకింగ్ న్యూస్.. చీర కట్టుకోవడం వలన కూడా క్యాన్సర్ వస్తుదంట!


దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడం వెన్నులో వణుకు పుట్టించే విషయంగా చెప్పవచ్చు. మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఇలా ఎన్నో రకాలుగా ఇది మానువులపై తన పంజా విసురుతూ, వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక క్యాన్సర్ అనేది వారసత్వం లేదా మనం తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా వస్తది అంటారు. కానీ చీర ద్వారా క్యాన్సర్ రావడం అనేది మహిళలను ఆందోళనకు గురి చేస్తోంది.

మన సంసృతి, సంప్రదాయనికి ప్రతీకైన చీర కట్టుకోవడం అనేది మహిళల్లో ప్రమాదాన్ని పెంచుతుదంట. అయితే మహిళలు లంగాను నడుముకు గట్టిగా కట్టుకొని, చీరను కట్టుకుంటారు. ఈ క్రమంలో నడుముపై గట్టిగా రుద్దినట్లై, చర్మం దెబ్బతిని క్యాన్సర్‌గా మారుతుదంట. తాజాగా 68 ఏళ్ల మహిళ ఈ క్యాన్సర్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే ఆమెకు చీర కట్టుకోవడం వలన క్యాన్సర్ రావడంతో.. దానికి చీర క్యాన్సర్ అని పేరు పెట్టారంట. అయితే ఆమె 13 ఏళ్ల నుంచి చీర కట్టుకుటున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక జార్ఖండ్, బీహార్‌లో చీర క్యాన్సర్ కేసులు అధికం అవతున్నాయంట. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య ఒక శాతంగా ఉన్నట్లు దీనిని వైద్య భాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారని నిపుణులు చెబుతున్నారు.



Source link

Related posts

అప్పగింతల కార్యక్రమంలో గుండెను పిండేసేలా ఏడుస్తున్న రాధిక మర్చంట్.. వీడియో వైరల్

Oknews

నవజాత శిశువులకు కూలర్, ఏసీ గాలి సురక్షితమేనా..

Oknews

వీటితో బరువు సులభంగా తగ్గొచ్చు.. అవేంటో తెలుసా?

Oknews

Leave a Comment