Entertainment

ఫ్యామిలీ సినిమా అన్నారు.. ఈ బూతులేంటి సామీ!


ఈమధ్య కాలంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా తగ్గిపోయాయి. కుటుంబమంతా కలిసి చూడదగ్గ మంచి కుటుంబ కథా చిత్రం ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అలాంటి ప్రేక్షకులకు ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్'(Family Star) బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. ఈ సినిమాని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమాలో ఉపయోగించిన బూతుల గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. లవ్, కామెడీతో ఫస్టాఫ్ క్యూట్ గా ఉందని.. సెకండాఫ్ లో కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటుందని, ముఖ్యంగా పతాక సన్నివేశాలు కట్టిపడేస్తాయని అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాలో ఉపయోగించిన కొన్ని పదాలను సెన్సార్ మ్యూట్ చేసింది. అవి పచ్చి బూతులు కావడంతో.. ఫ్యామిలీ సినిమాలో ఇలాంటి మాటలు ఏంటని అందరూ షాకవుతున్నారు. విజయ్ సినిమా అంటే ఇలాంటి డైలాగ్స్ ఉండాల్సిందేనా అని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నప్పుడు.. డైలాగ్స్ విషయంలో ముందే కేర్ తీసుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



Source link

Related posts

అతనితో శృంగారం చెయ్యలేక పరిగెత్తిన అర్జున్ రెడ్డి ప్రీతి 

Oknews

యూట్యూబ్ లో బాలయ్య మూవీ..ఇది వాళ్ళ పనే  

Oknews

హాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న వెంకటేష్ మూవీ..ఇండియన్ సినిమా హిస్టరీ లోనే మొదటిది  

Oknews

Leave a Comment