Health Care

మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్న కౌగిలింత.. ఇష్టమైనప్పుడు మాత్రమే !


దిశ, ఫీచర్స్ : కౌగిలింత అనగానే ఓన్లీ రొమాంటిక్ యాంగిల్‌ మాత్రమే అనుకోవాల్సిన అవసరం లేదు. అమ్మలాలనలోని వాత్సల్యం, అన్నా చెల్లెళ్ల అనుబంధం, ఆత్మీయుల అనురాగం వంటివన్నీ కౌగిలింతల లోగిలిలో పొదిగిపోతుంటాయి. అది ఏ రకమైన సంబంధంలో అయినా సరే, కౌగిలింతలోని మాధుర్యం అనుభవించిన వారికే తెలుస్తుందని నిపుణులు చెప్తుంటారు. పలు అధ్యయనాల్లోనూ ఇది వెల్లడైంది. ఆప్యాయతతో కూడిన లైంగికేతర శారీరక స్పర్శ కూడా ఒత్తిడిని, నిద్రలేమి సమస్యలను, డిప్రెషన్‌ను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఓ చిన్నారిని తన తల్లి కౌగిలించుకున్నప్పుడు మీరెప్పుడైనా గమనించారా? ఆ సందర్భంలో తల్లీ బిడ్డలు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా రకరకాల సందర్భాలు సంతోషాన్ని రెట్టింపు చేస్తుంటాయి. తోబుట్టువులు, స్నేహితులు, భార్యా భర్తలు, ఆత్మీయులు ఇలా ఎవరైనా సరే.. ప్రేమతో కౌగిలించుకున్నప్పుడు వారిలో మానసిక ఒత్తిడి క్షణాల్లో దూరమైపోతుంది. చేతులు పట్టుకోవడం, ఇష్టమైన వ్యక్తి ఛాతీపై తలవాల్చడం వంటివి కూడా హెల్త్ బెనిఫిట్స్‌తో ముడిపడి ఉన్నాయి.

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో పబ్లిషైన 2018 స్టడీ వివరాల ప్రకారం.. ఇష్టమైన వ్యక్తి కౌగిలింత లేదా స్పర్శ నొప్పి, బాధ, అలసట వంటి ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. కౌగిలింత అనేది అన్ని సందర్భాల్లోనూ, అందరి మధ్యా ఒకే విధంగా పనిచేయదు. కొందరికి ఇది అసౌకర్యంగా అనిపించవచ్చు. కేవలం ఇష్టమైన వ్యక్తుల మధ్య, ఇష్టంగా ఫీలయ్యే కౌగిలింతలు, స్పర్శ వల్ల మాత్రమే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని 2020లో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొన్నది.

స్టడీలో భాగంగా 40 వేలమంది భాగస్వాములను నిపుణులు ప్రశ్నించినప్పుడు దాదాపు 90 శాతం మంది కౌగిలింతవల్ల తాము ఏదో తెలియని మధురాను భూతిని పొందుతున్నట్లు వెల్లడించారు. ఇక 70 శాతం మంది పార్టిసిపెంట్స్ స్నేహితుల కౌగిలింత, స్పర్శ తమకు నచ్చుతుందని పేర్కొన్నారు. మొత్తానికి ఆత్మీయతతో కూడిన కౌగిలింత ఒత్తిడిని దూరం చేసే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలకు కారణం అవుతుంది. ఈ పరిస్థితి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్‌ను, నిద్రలేమి సమస్యను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అలాగే రక్తపోటును, కార్డియో వాస్క్యులర్ సమస్యల ప్రభావాన్ని అడ్డుకోవడం ద్వారా కౌగిలింత పరోక్షంగా మెరుగైన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తోంది.



Source link

Related posts

స్త్రీ వలన పురుషుడు పతనం అవుతున్నాడని తెలిపే సంకేతాలు ఇవే!

Oknews

ఐస్ బాత్ అంటే పడిచచ్చిపోతున్న సెలబ్రెటీలు.. అసలు దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?

Oknews

జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు సూత్రాలు పాటించాల్సిందే..!

Oknews

Leave a Comment