Telangana

telangana education department postponed summative assessment 2 exams | Telangana News: తెలంగాణలో ఎస్ఏ – 2 పరీక్షలు వాయిదా



Telangana Postponed Summative Assessment Exams: తెలంగాణ (Telangana News) విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ త్వరలో నిర్వహించనున్న ఎస్ఏ – 2 (Summative Assessment – 2) పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఎగ్జామ్స్ ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. దీని ప్రకారం ఈ నెల 15 నుంచి 22 వరకూ ఎస్ఏ – 1 పరీక్షలు జరగనున్నాయి. 23న పరీక్షా ఫలితాలు ప్రకటించి.. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. కాగా, ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకూ.. 8వ తరగతికి ఉదయం 9 గంటల నుంచి 11:45 వరకు, 9వ తరగతికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. డీఈవోలు, అన్ని స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఏప్రిల్ 2తో పదో తరగతి పరీక్షలు ముగియగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 24 స్కూళ్లకు చివరి పని దినం కాగా.. ఈ నెల 25 నుంచి జూన్ 11 వరకు వేసవిసెలవులు ప్రకటించారు. విద్యా శాఖ ఈసారి మొత్తం 45 రోజులు వేసవి సెలవులు ప్రకటించింది.
Also Read: Telangana News: తెలంగాణలో ఆ 2 రోజులు వర్షాలు – మండే ఎండల్లో కూల్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

మరిన్ని చూడండి



Source link

Related posts

Investment Key Benefits Of Sukanya Samriddhi Yojana Or SSY And You Can Make 70 Lakhs

Oknews

Pfrda Introducing Two Factor Aadhar Authentication For Nps Login From 01 April

Oknews

Big Joinings In Telangana Congress | Telangana Politics : తెలంగాణ కాంగ్రెస్‌లో జోరుగా చేరికలు

Oknews

Leave a Comment