Health Care

నేనే అందగాడిని.. అమ్మాయిలంతా నాతో రొమాన్స్ కోరుకుంటారు.. ఇది నిజంగా రోగమే..


దిశ, ఫీచర్స్ : యువతీ యువకులు చాలా మంది అందంగా ఉన్నామని ఫీల్ అయిపోతుంటారు. అందరూ తననే చూస్తున్నారని, తనతో రొమాన్స్ కోరుకుంటున్నారని, తనంటే పడి చచ్చిపోతున్నారని భ్రమపడుతుంటారు. దీంతో వారి ప్రవర్తన చూసేవాళ్లు.. ఇదేం రోగం, పోయేకాలం వచ్చిందా అని తిడుతుంటారు. అయితే నిజంగానే ఇది ఒక వ్యాధి అంటున్నారు వైద్యులు. చైనాకు చెందిన 20ఏళ్ల యువకుడు ఈ డెల్యూజనల్ లవ్ డిజార్డర్(Erotomania) బారిన పడ్డాడని గుర్తించారు.

ఈస్టర్న్ చైనాలోని జియాంగ్సు ప్రావినెన్స్ కు చెందిన యువకుడు లియు.. ఈ రేర్ కండిషన్ తో బాధపడుతున్నట్లు డయాగ్నోస్ చేయబడ్డాడు. యూనివర్సిటీలో ఫీమేల్ క్లాస్ మేట్స్ తనపట్ల రొమాంటిక్ ఫీలింగ్ కలిగి ఉన్నారని నమ్ముతూ వచ్చిన ఈ స్టూడెంట్.. స్కూల్ లోనూ గర్ల్స్ అందరూ తన చుట్టే తిరగాలని ఆరాటపడేవారని కాన్ఫిడెంట్ గా డాక్టర్స్ కు చెప్పాడు. ఈ ప్రపంచంలోనే బెస్ట్ లుకింగ్ బాయ్ అని మురిసిపోయిన అతడు.. అమ్మాయిలు నెగెటివ్ గా రెస్పాండ్ అయితే సిగ్గుపడుతున్నారనే మాయలో ఉండిపోయాడు. అసలు సొసైటీ గురించి పట్టించుకోవడమే మరిచిపోయాడు. రాత్రంతా నిద్రపోకుండా.. 24 గంటలు అవే ఆలోచనల్లో ఉంటూ.. డబ్బులు భారీగా వృధా చేస్తూ స్టడీస్ మీద దృష్టి పెట్టడం మానేశాడు. ఫ్యామిలీని కూడా ఇబ్బందులకు గురిచేశాడు. మొత్తానికి ఈ హలోజినేషన్ తన లైఫ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అయిపోయింది. దీంతో అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఈ రోగంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు.. సైకో థెరపీ అందించడంతో ప్రస్తుతం రికవర్ అవుతున్నాడు.



Source link

Related posts

రక్తహీనతను దూరం చేసే సూపర్ ఫ్రూట్స్ ఇవే .. డైట్‌లో చేర్చుకుంటే..

Oknews

Summer Health tips : వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి

Oknews

ఆత్మీయులకు దూరమైతే త్వరగా చనిపోతారా?.. అధ్యయనంలో తేలిన నిజాలివే..

Oknews

Leave a Comment