Health Care

వరుడు కావాలి.. షాకింగ్ షరతులు పెట్టిన యువతి..


దిశ, ఫీచర్స్ : ఒకప్పటి కాలంలో అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే స్వయంవరం ప్రకటించేవారు. తదుపరి కాలంలో పెద్దలు సంబంధాలు కుదిర్చి వివాహం చేసేవారు. ప్రస్తుతం కాలం మారింది, టెక్నాలజీ పెరిగిపోయింది. స్వయంగా అమ్మాయిలే తనకు ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత జీతం ఉండాలో నిర్ణయించుకుంటున్నారు. అంతే కాదు వారి రిక్వైర్మెంట్ లను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. ఆ షరతులను చూసిన వారు మాత్రం ఈ అమ్మాయికి ఈ జన్మలో పెళ్లి కాదు అనుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి ఒక సంఘటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయికి ఎలాంటి వరుడు కావాలో చూసేద్దామా..

ముంబైకి చెందిన 37 ఏళ్ల మహిళకు చెందిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ మహిళ తన కోసం ఓ వరుడిని సోషల్ మీడియా వేదికగా వెతుకుతోంది. కానీ ఏ అబ్బాయి కూడా ఆమె అంచనాలను అందుకోవడం చాలా కష్టం. వాస్తవానికి ఆమె పెట్టిన షరతులతో సరిపోయే వరుడు దొరకడం కాస్త కష్టమే అనుకోవాలి. ఆ మహిళ రిక్వైర్మెంట్ జాబితా స్క్రీన్‌షాట్ మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ వినియోగదారులు ఆ పోస్ట్ ని చదివి ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

అంబర్ అనే వినియోగదారు మరాఠీలో ఉన్న ఈ స్క్రీన్‌షాట్‌ని Xలో షేర్ చేశారు. దానిని ఆంగ్లంలోకి అనువదించగా ఆ మహిళ ముంబైలో పనిచేస్తుందని, ఏడాదికి రూ.4 లక్షలు సంపాదిస్తున్నట్లు తేలింది. ముంబైలో సొంత ఇల్లు ఉన్న భాగస్వామి కోసం వెతుకుతున్నానని తెలిపింది. వ్యాపారవేత్త గానీ, సర్జన్, సిఏ ఎవరైనా పర్వాలేదు ప్రాధాన్యత ఇస్తానని రాసింది. అంతే కాదు ఏడాదికి కనీసం కోటి రూపాయలు సంపాదించే భర్త కోసం ఆమె వెతుకుతున్నట్లు వైరల్ స్క్రీన్ షాట్ లో ఉంది. @Ambar_SIFF_MRA హ్యాండిల్‌లో ఏప్రిల్ 2న ఈ పోస్ట్ భాగస్వామ్యం అయింది. ఈ స్క్రీన్ షాట్ ని చూసిన వినియోగదారులు వివిధ రకాలుగా కామెంట్లు పెట్టారు.

X వినియోగదారు క్షితిజ్ మాల్వే ఇలా వ్యాఖ్యానించారు, ‘ఒక డేటా ప్రకారం, భారతదేశంలో కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య కేవలం 1.7 లక్షలు మాత్రమే. అలాంటప్పుడు ఈ మహిళ తన 37 సంవత్సరాల వయస్సులో ‘ప్రిన్స్ ఆఫ్ డ్రీమ్స్’ని పొందే సంభావ్యత 0.01%.’ అలాగే @pjexplained హ్యాండిల్ నుండి ఒక వినియోగదారు, ‘ఆమెను షార్క్ ట్యాంక్‌లో ఒకసారి పిచ్ చేయాలి .’ అని రాశారు. మరొక వినియోగదారు, ‘ఈ విధంగా మీరు ఒంటరిగా ఉండిపోవాల్సిందే’ అని రాశారు.





Source link

Related posts

‘హే బడ్డీ మమ్మా విల్ మిస్ యూ సో మచ్ ’.. బాధలో అంకితా లోఖండే..

Oknews

టీ షర్టు నుంచి ప్యాంటు వరకు.. మనం ధరించే దుస్తులు, అలంకరణల వెనుక పురాతన మూలాలు ఇవే..

Oknews

పైగాస్మ్ అంటే ఏమిటి.. నిజంగా శృంగారంలో పాల్గొన్న ఆనందాన్ని ఇస్తుందా.. ?

Oknews

Leave a Comment