Health Care

పైగాస్మ్ అంటే ఏమిటి.. నిజంగా శృంగారంలో పాల్గొన్న ఆనందాన్ని ఇస్తుందా.. ?


దిశ, ఫీచర్స్ : పురుషుల్లో కానీ, మహిళల్లో కానీ కొంతమంది సెక్స్ సమయంలో తమకు కావలసినంత భావప్రాప్తిని పొందలేదు. ముఖ్యంగా స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా భావప్రాప్తి పొందలేరు. అలాంటి సమయంలో వారు భావప్రాప్తి కోసం వివిధ మార్గాలను ఎంచుకుని ప్రయత్నిస్తుంటారు. అందులో ఒక మార్గమే పెగాస్మ్. ఇది మహిళలు భావప్రాప్తిని అనుభవించగల ఒక పద్ధతిని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్గాన్ని ఎంచుకునే ముందు, ప్రయత్నించే ముందు అది ఏమిటి, ఎంత సురక్షితమైనది అనే విషయాలను నిపుణుల నుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి పైగాస్మ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైగాస్మ్ అంటే ఏమిటి..

పైగాస్మ్ అనే పదం పై (పీ), ఉద్వేగంతో రూపొందించారు. ఈ పద్దతిలో మూత్రం వచ్చినపుడు ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తారు. దీంతో పైగాస్మ్ సంచలనం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా మూత్రాశయంలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అంతే కాదు స్పాంజ్, క్లిటోరిస్‌తో సహా స్త్రీ ఎరోజెనస్ జోన్‌ల పై ఒత్తిడి పెరగడం ప్రారంభిస్తుంది. తరువాత నెమ్మదిగా మూత్రాశయ గోడలు విస్తరిస్తాయి. మూత్రాశయంలోని నరాలు ఈ ఒత్తిడి కారణంగా ప్రేరణకు గురవుతాయి. దీంతో మెదడుకు లైంగిక ప్రేరణ సంకేతాలు అందుతాయి. తర్వాత మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆహ్లాదకరమైన అనుభూతి, భావప్రాప్తి కలుగుతుంది. అలాగే కొంతమంది వ్యక్తులు పీ – గ్యాస్‌లను ఆహ్లాదకరమైన అనుభవంగా భావించినప్పటికీ ఈ ప్రక్రియలో సంభావ్య ప్రమాదాలు ఉన్నాయంటున్నారు.

ప్రమాదాలు..

1.మూత్రాశయ ఇన్ఫెక్షన్

పైగాస్మ్ పద్దతిని పాటిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తరచుగా మూత్ర విసర్జన ఆపడం ద్వారా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లు వస్తాయంటున్నారు. ఎక్కవ సమయం మూత్రం మూత్రాశయంలో ఉంటే బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇలా మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.

2. మూత్రాశయ కండరాలకు హాని.

పైగాస్మ్ పద్దతి ద్వారా మూత్రాశయ కండరాలకు హాని జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. తరచూ మూత్రాశయ గోడలు పరిమితికి మించి విస్తరిస్తూ ఉంటే భవిష్యత్తులో కండరాలు దెబ్బతింటాయి.

3. కిడ్నీ సమస్యలు..

ఎక్కువ సేపు మూత్రాన్ని లోపలే ఉంచితే కిడ్నీ సమస్యలకు వస్తాయంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతే కాదు మూత్రపిండాలు కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

4. సెక్స్‌పై దుష్ప్రభావాలు

పైగాస్మ్ పద్ధతి ద్వారా భావప్రాప్తిని పొందేందుకు శరీరం అలవాటుపడుతుందట. అలాగే హస్తప్రయోగం చేసినప్పుడు, సంభోగం జరిగినప్పుడు లైంగిక ఆనందాన్ని పొందడం కష్టతరం అంటున్నారు.



Source link

Related posts

Milk : పాలు తాగడానికి సరైన సమయం ఏదో తెలుసా?

Oknews

పెళ్లైన మహిళకు త్వరగా వచ్చేస్తున్న హైబీపీ.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!

Oknews

మాఘ పూర్ణిమ రోజు ఇలా చేస్తే.. మీ కోరికలు నెరవేరతాయి..

Oknews

Leave a Comment