Sports

SRH Vs CSK IPL 2024 Preview and Prediction


Sunrisers Hyderabad vs Chennai Super Kings Preview: హైదరాబాద్‌లో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) 277 పరుగులతో విధ్వంసం సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో అమీతుమీ తేల్చుకోనుంది. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన చెన్నై జట్టు… అంతే బలంగా ఉన్న సన్‌రైజర్స్‌ బ్యాటర్లు.. హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌  స్టేడియంలో ఎంత విధ్వంసం సృష్టిస్తారో అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైజాగ్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఐపీఎల్‌లోనే తొలి ఓటమి చవిచూసిన చెన్నై సూపర్‌కింగ్స్‌… ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. తలా ధోనీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండడడంతో  అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

బ్యాటర్ల జోరేనా..?
ఈ ఐపీఎల్లో  277 పరుగులతో విధ్వంసం సృష్టించినా హైదరాబాద్‌… ఈ మ్యాచ్‌లో మరోసారి భారీ స్కోరు చేసి విజయాలు బాట పట్టాలని చూస్తోంది.  2016లో తన తొలి ఐపీఎల్‌ సీజన్‌లో 17 వికెట్లతో సత్తా చాటిన  ముస్తాఫిజుర్ రెహ్మాన్‌… ఎనిమిదేళ్ల తర్వాత  ఇప్పుడు కూడా చెన్నైకి కీలక బౌలర్‌గా ఉన్నాడు. అయితే ఎంతటి బౌలర్‌ను అయినా ధాటిగా ఎదుర్కోగల బ్యాటర్లు సన్‌రైజర్స్‌కు ఉన్నారు. అభిషేక్ శర్మ ఇదే టెంపోను  కొనసాగిస్తే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు. ట్రావిస్ హెడ్ ఎంత విధ్వంసకర బ్యాటరో చెన్నైతో పాటు అభిమానులకు కూడా బాగా తెలుసు. ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ మంచి టచ్‌లోకి వస్తే చెన్నై బౌలర్లకు తిప్పలు తప్పకపోవచ్చు. మరోవైపు  శివమ్‌ దూబే రూపంలో చెన్నైకి ఓ మంచి హిట్టర్‌ ఉన్నాడు. డారిల్ మిచెల్ కూడా భారీ సిక్సర్లను అవలోకగా కొట్టగలడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్‌రైజర్స్‌ జట్టులో వానిందు వానిందు హసరంగా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్రాన్ మాలిక్‌ని తుది జట్టులోకి తీసుకోవాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ భావిస్తోంది. మాలిక్‌ వేగం సన్‌రైజర్స్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉమ్రాన్‌ మాలిక్ జట్టులోకి వస్తే మయాంక్ అగర్వాల్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ జట్టు( అంచనా‌):
మయాంక్ అగర్వాల్,  ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్/వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్,  పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మార్కండే, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్. 

చెన్నై జట్టు( అంచనా‌): రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, సమీర్ రివ్జీ, రవీంద్ర జడేజా,  MS ధోని, దీపక్ చాహర్,  తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్/మహీష్ తీక్షణ, మథీషా పతిరనా.

మరిన్ని చూడండి



Source link

Related posts

Ind Vs Eng 5th Test Dharamsala Team India Allout At 477 Lead By 259

Oknews

MI vs CSK IPL 2024 Chennai Super Kings won by 20 runs

Oknews

ఎదురులేని భారత్, మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్

Oknews

Leave a Comment