Health Care

నిజాయితీ గల వ్యక్తులే ఆన్‌లైన్‌లో ఎక్కువగా మోసపోతున్నారు.. అధ్యయనంలో వెల్లడి


దిశ, ఫీచర్స్ : నిజాయితీగా ఉండటం మంచి వప్రర్తనకు, వ్యక్తిత్వానికి నిదర్శనంగా పేర్కొంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది సదరు వ్యక్తులకు నష్టం కూడా చేకూరుస్తుందని ఒక తాజా అధ్యయనం పేర్కొన్నది. ముఖ్యంగా ఇంటర్నెట్ కేంద్రంగా హానెస్ట్ పీపుల్ ఎక్కువగా మోసపోతున్నారని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ స్కాములు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? మోసపోయే వారిలో ఎటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉంటున్నారు? అనే విషయాలను తెలుసుకునే ఉద్దేశంతో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, అలాగే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు స్టడీ నిర్వహించారు.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు మొత్తం 310 మంది పార్టిసిపెంట్స్‌‌ను ఎంచుకుని, వారికి ఆన్‌లైన్ కేంద్రంగా వివిధ టాస్కులు కేటాయించారు. ముందే కొన్ని సూచనలు చేశారు. మరికొన్ని విషయాలను వారికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. ప్రధానంగా పార్టిసిపెంట్స్‌ అందరూ జంటగా ఆడే ఆన్‌లైన్ కార్డ్ గేమ్‌లో పాల్గొనాలని సూచించారు. ఇక్కడ కొన్నికార్డుల ద్వారా డబ్బులు గెలువవచ్చు. మరికొన్ని ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి.

అయితే పార్టిసిపెంట్స్ ఆన్‌లైన్‌లో మరొక ఆటగాడి ఖర్చుతో ఎక్కువ డబ్బులు గెలవడానికి అబద్ధాలు చెప్పవచ్చని సూచించారు. అలాగే ప్రతీ ఆట ముగింపులో పార్టిసిపెంట్స్ ఇతర ప్లేయర్స్ ఎంత నిజాయితీగా ఉన్నారో రేట్ చేయాలని కూడా సూచించారు. ఉదాహరణకు అబద్దం చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి నమ్మాడా? ఎటువంటి వ్యక్తి నమ్మాడు?, తాము ఓడిపోయినప్పుడు ఇతరులు అబద్ధం చెప్పినట్లు గ్రహించారా? ఇలాంటి విషయాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు.

ఫైనల్‌గా ఏంటంటే ‘‘అబద్ధాలు ఆడకూడదు. నిజాయితీగా ఉండాలి. అవతలి వ్యక్తిని మోసం చేయకూడదు’’ అనే భావాలు కలిగిన వ్యక్తులే 80 శాతం వరకు అబద్ధాలను నమ్మారని, 90 శాతం మోసపోయారని తేలింది. ఆ తర్వాత మరికొంతమంది ఆన్‌లైన్‌లో మోసపోయిన బాధితులను కూడా నిపుణులు పరిశీలించి వివరాలు రాబట్టారు. మొత్తానికి ఆన్‌లైన్ కేంద్రంగా హానెస్ట్ పీపుల్ మాత్రమే ఎక్కువగా మోసపోతున్నారని, కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచిస్తున్నారు.



Source link

Related posts

వర్షం పడినప్పుడు ఆకాశంలో మెరుపులు ఎందుకు వస్తాయో తెలుసా?

Oknews

ఆ వ్యక్తికి 9 నెలల్లో 217 కోవిడ్-19 వ్యాక్సిన్లు… చివరికి ఏం అయ్యిందంటే..

Oknews

భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. షాకింగ్ వీడియో వైరల్

Oknews

Leave a Comment