ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే స్కూల్ పిల్లాడ్ని పిలిచి రష్మిక మందన్న(rashmika mandanna) సినిమాల లిస్ట్ చెప్పమంటే టకటకా చెప్తాడు. ఛలో దగ్గరనుంచి మొన్నటి యానిమల్ వరకు సిల్వర్ స్క్రీన్ మీద తన హవాని కొనసాగిస్తు వస్తుంది. పైగా హీరో అన్ని రకాల పాత్రల్ని పోషించినట్టు తను కూడా అన్ని రకాల పాత్రల్ని పోషిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హీరోయిన్లకి అలాంటి అవకాశం లేదు. కానీ దర్శకులు,రచయితలు ఆమె కోసమే కథల్ని కూడా సృష్టిస్తున్నారు. దీన్ని బట్టి ఆమె రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఆమె పోస్టర్ ఒకటి నిమిషాల్లోనే వైరల్ గా మారింది
ఈ రోజు రష్మిక పుట్టిన రోజు.ఈ సందర్భంగా పుష్ప 2 (pushpa 2) లోని ఆమె లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.చిలక పచ్చ రంగు చీరలో ఒంటి నిండా నగలు ధరించుకొని ఉన్న లుక్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. పైగా తన కుడి చేతిని కుడి కంటికి రౌండ్ గా అడ్డుపెట్టి అందులోనుంచి చూస్తుంది. పైగా ఫేస్ ని సీరియస్ లుక్ లో పెట్టి శ్రీవల్లితో ఆటలొద్దు అని వార్నింగ్ ఇచ్చేలా ఉంది. ఈ లుక్ తో పుష్ప 2 మీద అంచనాలు మరింతగా పెరిగాయి. పుష్ప 1 లో కొంచం సాఫ్ట్ లుక్ లో కనిపించిన రష్మిక 2 లో తన ప్రతాపాన్ని చూపించబోతుందనే విషయం కూడా అర్ధం అవుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)హీరోగా వస్తున్న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 15 న విడుదల కాబోతుంది.సుకుమార్ దర్శకుడుకాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా పార్ట్ 1 క్యాస్ట్ నే 2 లోను చేస్తుంది.ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.