Telangana

TS EAPCET 2024 application last date is April 6 without late fee apply now



TS EAPCET 2024 Application Deadline: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించనున్న ‘టీఎస్ ఈఏపీసెట్-2024’ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎప్‌సెట్ దరఖాస్తు గడువు శనివారం(ఏప్రిల్ 6)తో ముగియనుంది. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక రూ.250 ఆల‌స్య రుసుమతో ఏప్రిల్ 9 వ‌ర‌కు, రూ.500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 19 వ‌ర‌కు, రూ.5000 ఆల‌స్య రుసుముతో మే 4 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 8 నుంచి 12 వరకు ఎడిట్ చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలోనే ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులు త‌మ వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. 
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 7 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా విభాగాలకు;  మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సెషన్‌లో, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. 
వివరాలు…
➥ టీఎస్ ఎప్‌సెట్-2024
ఇంజినీరింగ్ కోర్సులు: బీఈ/ బీటెక్‌, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (బయో-టెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (ఎంపీసీ), ఫార్మ్-డి (ఎంపీసీ).
అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులు: బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ(ఫారెస్ట్రీ), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌(ఫుడ్ టెక్నాలజీ), బీఫార్మసీ (బైపీసీ), ఫార్మ్-డి (బైపీసీ), 
అర్హత: ఇంటర్మీడియట్‌(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు సంబంధించి డిప్లొమా చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 31.12.2024 నాటికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 16 సంవత్సరాలలోపు ఉండాలి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు 17 – 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 
రిజిస్ట్రేషన్ ఫీజు: ఇంజినీరింగ్ (లేదా) అగ్రికల్చర్ & ఫార్మా పరీక్షల్లో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రెండు విభాగాలకు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్‌ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. 
పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్ (4 జోన్లు), నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులోని కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 21.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.04.2024.
➥ దరఖాస్తుల సవరణ: 08.04.2024 – 12.04.2024.
➥ రూ.250 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 09.04.2024.
➥ రూ.500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 14.04.2024.
➥ రూ.2500 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 19.04.2024.
➥ రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 04.05.2024.
➥ పరీక్ష తేది09.05.2024 – 12.05.2024.
TS EAPCET – 2024 Detailed Notification
Pay Registration Fee 
Fill Online Application
Print Filled-in Application
Know Your Fee Payment Status
Website
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Related posts

TS Ministers to Nalgonda: ఎలక్షన్ టైమ్‌లో అధికార పార్టీ..అభివృద్ధి పనుల జాతర

Oknews

రెండు గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’- కేబినెట్ కీలక నిర్ణయాలివే!-hyderabad news in telugu ts cabinet key decisions 500 gas cylinder free power schemes approved ,తెలంగాణ న్యూస్

Oknews

MLC Kavitha on Gurukul Students Issues : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం | ABP Desam

Oknews

Leave a Comment