Health Care

అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?


దిశ, ఫీచర్స్ : ఉగాది పండుగ అంటే తెలుగు ప్రజలకు చాలా ఇష్టం. ఏప్రిల్9న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను తెలుగు ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.కాగా, అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకోవాలి. దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కల్ప ఆరంభం యుగ ఆరంభము అయిన రోజును యుగాదిగా చెప్పడం జరిగిదంట. ఈరోజునే బ్రహ్మదేవుడు సృష్టిని పుట్టించాడంట. బ్రహ్మ సృష్టిలో ప్రళ భయం అయిపోయిన తరువాత తిరిగి ఆరంభించే అధ్యాయాన్ని బ్రహ్మ కల్పం అని అంటారు. ఈ ప్రారంభ కాలాన్ని కల్పాది అని వ్యవహరిస్తారు. ప్రతి కల్పంలోను మొదట వచ్చే ఆది సమయమే ఉగాది పండుగ. దీని గురించి సూర్య సిద్ధాంతం అనే జ్యోతిష్య గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. నాటి నుండి నేటి వరకు ఈ పద్ధతినే అనుసరిస్తూ ప్రతీ తెలుగు సంవత్సర ఆరంభ దినం నాడు మనం ఉగాది పర్వదినం జరుపుకునే ఆచారం ఏర్పడిందంట. అలాగే ఉగాది పండుగను జరుపుకుంటున్నామని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఈ పండగను జరుపుకుంటాం. ఎందుకంటే శిశిరంలో చుట్లు ఆకులు రాల్చి , చైత్ర మాసంలో చిగురు తొడిగి మురిసిపోతాయంట. అలా ప్రకృతికి సంభవించే నూతన సంవత్సరం చైత్రమాసారంభానికి ఉగాది అని పెరు వచ్చిదంట. అలా మన తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను జరుపుకుంటున్నారు.



Source link

Related posts

ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లే!

Oknews

చెదపురుగులు మీ ఇంటిని పాడు చేస్తున్నాయా.. అయితే, ఈ చిట్కాలతో తరిమికొట్టండి

Oknews

అతని మ్యూజిక్ కి మనుషులే కాదు పక్షులు కూడా మెస్మరైజ్ కావాల్సిందే..

Oknews

Leave a Comment