Health Care

ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారా.. అయితే మీరు పాటించాల్సిన టిప్స్ ఇవే?


దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పోటాపోటిగా ఎన్నికల ప్రచారలు కొనసాగిస్తున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి.చాలామంది ప్రచారం కోసం ఎండలోనే తిరుగుతారు. దీనికి తోడు ఈ ఏడాది సూర్యుడు ఫిబ్రవరి నుంచే విపరీతమైన ఎండలతో మండిపోతున్నాడు. బయటికి వెళ్లడానికే జనాలు భానుడి వేడికి భయపడిపోతున్నారు. ఈ ఎండలు జూన్ వరకు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎన్నికలు కూడా సరిగ్గా జోరు ఎండలు ఉన్నప్పుడే ప్రారంభం అయ్యాయి . దీంతో ప్రచారానికి వెళ్లె వారు ఎండకు తట్టుకోలేకపోతున్నారు.ప్రచారానికి వెళ్లే కార్యకర్తలు తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

*ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గొడుగు చేతిలో ఉండాలి. లేకపోతే తలతిరగడం, డీహైడ్రేషన్ తదితర సమస్యలు వస్తాయి. ఎన్నికల ప్రచారానికి వెళ్లేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. నిమ్మ రసం, మజ్జిగ తాగాలి. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి సాయపడుతుంది. ఈ వేసవిలో డీహైడ్రేషన్ ఎక్కువైతే ఆరోగ్యం సమస్యలు వస్తాయి.

*ప్రచారానికి వెళ్లే వారిలో చాలా మంది మద్యం సేవించి తిరుగుతారు. ఈ వేడి వాతావరణంలో మద్యం సేవించడం మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దాని గురించి జాగ్రత్త వహించి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

*నిజానికి ఎండాకాలం చికెన్ తినడం మంచిది కాదు. ఇప్పటికే భరించలేనంత వేడి వాతావరణంలో ఉన్నాం. ఎందుకంటే ఈ ఎండలో మాంసాహారంలో బాక్టీరియా త్వరగా ఉత్పత్తి అవుతుందని, దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే బిర్యానీ, మటన్, చికెన్ తినడానికి వెళ్లకండి.

*ప్రచారంలో భాగంగా ప్రజలు, కార్యకర్తలు కాలినడకన ర్యాలీల్లో పాల్గొంటారు. ఎండలో నడవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. వడదెబ్బకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో శరీర ఉష్ణోగ్రత పెరగడం, విపరీతమైన దాహం, కళ్లు తిరగడం, గుండె దడ, నోటి నుంచి నురగలు రావడం వంటివి జరుగుతాయి.

*ఎవరైన వడదెబ్బకు లోనైతే ఆ వ్యక్తిని నీడలో కూర్చోబెట్టి, ఆపై వారికి తాగడానికి నీరు ఇవ్వండి. నీటితో వారి తలపై తడుపుతూ ఉండాలి. ఆపై తడి గుడ్డతో వారి శరీరంపై రుద్దాలి. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లండి. ఈ చిట్కాలు పాటిస్తే మీకు ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

Read More..

Ap Politics:గెలిపిస్తే నిత్యం ప్రజలతోనే..ప్రజా సేవలోనే: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి



Source link

Related posts

ఈ సింపుల్ టిప్స్ తో నడుము నొప్పికి చెక్ పెట్టొచ్చు!

Oknews

మీరు కలలో ఈ రంగు కుక్కను చూశారా.. దేనికి సంకేతమో తెలుసా..

Oknews

ఎమోషనల్ రెస్ట్ అంటే ఏమిటి?.. ఎందుకు అవసరం?

Oknews

Leave a Comment