EntertainmentLatest News

గంగమ్మ లుక్ ఓ రేంజ్ లో ఉంది!


చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని  పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. 

ఈరోజు(ఏప్రిల్ 7) టాలెంటెడ్ హీరోయిన్ పార్వతీ తిరువోతు పుట్టినరోజు సందర్భంగా ‘తంగలాన్’లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మహిళా రైతు క్యారెక్టర్ లో ఆమె నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది.

‘తంగలాన్’ సినిమాలో విక్రమ్ ను ఓ కొత్త నేపథ్యంలో, విభిన్నమైన క్యారెక్టర్ లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కిషోర్ కుమార్, ఎడిటర్ గా ఆర్కే సెల్వ వ్యవహరిస్తున్నారు.



Source link

Related posts

Nani Who Shocked Balagam Venu బలగం వేణుకి నాని షాక్

Oknews

మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘జితేందర్‌రెడ్డి’!

Oknews

Rangareddy Is The Richest District In Telangana | Richest Districts: తెలంగాణలో రిచ్చెస్ట్ జిల్లాగా రంగారెడ్డి

Oknews

Leave a Comment